విమల్ - రస్నా ప్రకటనల రూపకర్త ఇక లేరు

Mudra Ads Founder Gopala Krishnamacharya Passed Away

03:30 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Mudra Ads Founder Gopala Krishnamacharya Passed Away

ప్రముఖ యాడ్ ఏజన్సీ ముద్ర యాడ్స్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌, యాడ్ దిగ్గజం అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి శుక్రవారం కన్నుమూశారు. ఈయన వయస్సు 73 సంవత్సరాలు.1942 ఏప్రిల్‌ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించిన కృష్ణమూర్తి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన గోపాలకృష్ణమూర్తి కాలికో టెక్స్‌టైల్‌ మిల్లులో చిరుద్యోగంతో ప్రస్థానం ప్రారంభించారు. 1972లో శిల్పి అడ్వర్‌టైజింగ్‌లో అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరిన ఈయన 1976లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో అడ్వర్‌టైజింగ్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అయితే 1980 మార్చి 25, న కృష్ణమూర్తి ముద్ర కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ పేరుతో సొంత యాడ్‌ ఏజెన్సీని నెలకొల్పారు. విమల్‌, రస్నా వంటి ప్రముఖ ప్రకటనలకు ఎ.జి.కృష్ణమూర్తి రూపకర్త అయిన గోపాల కృష్ణ మూర్తి వ్యక్తిత్వ వికాసం, అడ్వర్‌టైజ్‌మెంట్‌ రంగాలపై పలు రచనలు చేశారు. ఇక ధీరూభాయ్‌ అంబానీ జీవనశైలి పై అనేక రచనలు చేశారు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. ఈయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెల్పారు.

English summary

India Famous Ads Agency Mudra Ads Agency Founder and Chairman Atchyutani Gopala Krishnamurthy passes away today.He was known as the man who changed the Indian advertising landscape over the last two decades.He has made the popular adds like Vimal,Rasna etc