మళ్ళీ దీక్షకు రెడీ - డెడ్ లైన్

Mudragada Padmanabham Deadline To AP Government

11:21 AM ON 8th June, 2016 By Mirchi Vilas

Mudragada Padmanabham Deadline To AP Government

తుని రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దగ్దం ఘటనపై అరెస్టుల పర్వం మొదలవ్వడంతో తేనే తుట్టె కదిలినట్లు వ్యవహారం తయ్యారయింది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మళ్ళీ ఉద్యమ రంగంలోకి దిగడానికి నిర్ణయించుకున్నారు. తుని ఘటనకు సంబంధించి బుధవారం సాయంత్రం లోగా కేసులు ఎత్తి వేయకపోతే గురువారం నుంచి తిరిగి నిరవధిక దీక్ష ప్రారంబిస్తానని హెచ్చరించారు. కిర్లంపూడి లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గురువారం ఉదయం 9 గంటలనుంచి దీక్ష చేపడతానని ఆయన చెప్పారు.

తుని సభ కు వచ్చినవారిని అరాచక శక్తులుగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పైనా ఆయన నిప్పులు చెరిగారు. కాపులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సర్కార్ కళ్ళు తెరచి తమ ఉద్యమం ఉధృతం కాకముందే మేల్కొనాలని కోరారు. మొత్తానికి వాతావరణం చల్లబడినప్పటికీ ఉద్యమాలతో వేడెక్కనుంది.

ఇవి కూడా చదవండి:మే నెలలో కోటి లడ్డూల పంపిణీ... ఇదో కొత్త రికార్డు

ఇవి కూడా చదవండి:అమలాపురంలో ఉద్రిక్తత - స్టేషన్ ఎదుట ముద్రగడ భైఠాయింపు

English summary

Kapu Leader Mudragada Padmanabham demanded to lift over the cases on the members on Tuni Incident and he also put a dead line to Andhra Pradesh Government.