చేతిలో పురుగుల మందు డబ్బా .. పోలీసులకు హెచ్చరిక(వీడియో)

Mudragada Padmanabham Hunger Strike With Poison Bottle

01:17 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Mudragada Padmanabham Hunger Strike With Poison Bottle

కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ ఉదయం కిర్లంపూడి లో భార్యతో సహా దీక్షకు దిగిన సందర్భంగా ఆయన్ను అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారు. కిర్లంపూడి లో ముద్రగడ నివాసం గగ్గర ఉద్రిక్తత నెలకొంది. అయితే పురుగుల మందు డబ్బాతో ముద్రగడ పోలీసులకు హెచ్చరిక జారీ చేసారు. తుని ఘటనలో కాదు, అమలాపురం పోలీస్ స్టేషన్ దగ్గర బైఠాయింపు కేసులో అరెస్టు చేసామని పోలీసులు చెబితే , తుని విద్వంసం కేసులో అయితే అరెస్టు అవుతానని ముద్రగడ స్పష్టం చేసారు. అరెస్తుకి సిఐడి పోలీసులను సమన్లతో రమ్మని కిటీకీ లోంచి పోలీసులతో ముద్రగడ సీరియస్ గా అన్నారు. ఇక ఎవరొచ్చినా వచ్చిన తలుపులు తీయొద్దని అనుచరులకు ముద్రగడ చెప్పారు. దీంతో ఆయన నివాసం దగ్గర ఉత్కంఠ కొనసాగుతోంది.

కల్సి చచ్చిపోదాం
ఓపక్క పురుగుల మందు డబ్బాతో ముద్రగడ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరోపక్క పక్కనే వున్న భార్య కంట తడి చూసి , 'భయపడకు..పెళ్ళినాటి ప్రమాణం గుర్తుంది కదా..కల్సి చచ్చిపోదాం' అంటూ ముద్రగడ చెప్పడం అక్కడ కలకలం రేపింది. ఇది కూడా కొన్ని చానెల్స్ లో లైవ్ టెలికాస్ట్ అయింది. కుమారుడు కూడా కంటతడి పెట్టుకున్న నేపధ్యంలో ధైర్యంగా వుండు అంటూ ముద్రగడ చెప్పారు. మొత్తానికి ఆయన నివాసం దగ్గర ఏక్షణం లో ఏమి జరుగుతుందోనని ఆందోళన నెలకొంది.

మీడియాను పంపించేసిన పోలీసులు
అక్కడ ఉద్రిక్త వాతావరణం నేపధ్యంలో మీడియాను కూడా అక్కడ నుంచి పోలీసులు బయటకు పంపారు. తలుపులు వేసుకుని లోపలే వున్న ముద్రగడ కిటికీలోంచే మాట్లాడుతూ, పురుగుమందు డబ్బా చూపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: దీక్షకు దిగిన ముద్రగడ

ఇవి కూడా చదవండి: ఐసియు లో చేరిన రజనీకాంత్... అసలు ఏమయింది ?

English summary

Kapu Leader Mudragada Padmanabham once again started Hunger Strike in his House in Kirlampudi and he warns by holding Poison Bottle and doing Hunger Strike.