2వ రోజూ కొనసాగుతున్న దీక్ష

Mudragada Padmanabham indefinite fast continues on Second Day

01:15 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Mudragada Padmanabham indefinite fast continues on Second Day

కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆయన సతీమణితో కలిసి చేపట్టిన ఆమరణ దీక్ష శనివారం రెండో రోజుకు చేరింది. ముద్రగడ కు, అయన సతీమణి పద్మావతికి వైద్య పరీక్షలు చేసారు. అయితే పద్మావతి కి చక్కెర నిల్వల స్థాయిలు పడిపోయాయని వైద్యులు తెలిపారు. వైద్య బృందం ప్రతి 3గంటల కోసారి ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. కాగా ముద్రగడకు అత్యంత సన్నిహితత్వం గల ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు గత రాత్రి ముద్రగడతో చర్చలు జరిపారు. ముద్రగడ చెప్పిన అంశాలను సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు భాస్కరరావు తెలిపారు. ఇక అమలాపురంలో నల్లా బ్రదర్స్ కూడా ముద్రగడ కు మద్దత్తుగా ఆమరణ దీక్ష చేపట్టి , కొనసాగిస్తున్నారు. జిల్లా అంతటా 144 సెక్షన్ , సెక్షన్ 30 అమలు చేస్తున్నారు.

కాగా అమలాపురం లో ఎపి హొమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇంటి దగ్గర ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. విశాఖలో వున్న సిఎమ్ చంద్రబాబు కూడా మంత్రులతో సమీక్షించారు.

English summary

Ex-Minister and Kapu Caste Leader Mudragada Padmanabham indefinite fast continous on second day.Doctors have been checking Mudragada Padmanabham and his wife health for every three hours.