మళ్ళీ దీక్షకు ముద్రగడ సమాయత్తం!?

Mudragada Padmanabham Letter To Chandrababu Naidu

11:16 AM ON 3rd March, 2016 By Mirchi Vilas

Mudragada Padmanabham Letter To Chandrababu Naidu

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి దీక్షకు దిగాబోతున్నారా? తాజాగా ఆయన రాష్ట్ర సర్కార్ పై విరుచుకు పడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు ఉద్యమాన్ని బాబు మోసపూరిత వాగ్దానాలతో నీరుగార్చారని ఆరోపించారు. ‘‘నోటిమాటతో దీక్ష విరమించినందుకు సిగ్గుపడుతున్నా. మరోసారి ఉద్యమిస్తా. రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ఖరారు చేస్తా’’ అని ప్రకటించారు. కాపు రుణాల మంజూరులో పచ్చచొక్కాలకే ప్రాధాన్యం ఇచ్చి అసలైన పేదలను విస్మరించారని ఆయన ద్వజమెత్తారు. 'కాపు సంక్షేమానికి రూ.500 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని చెప్పి... పైసా ఇవ్వలేదు. తుని ఘటనలో లోతైన విచారణ చేపట్టాకే కేసులు పెడతామని హామీ ఇచ్చి... ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు' ఆయన విమర్శించారు. ఇక తమ ఉద్యమం వెనుక ఏ పార్టీ ప్రమేయం లేదని ఆయన పునరుదాటించారు.

1/5 Pages

తాజగా మరో లేఖాస్త్రం ... 

 సిఎమ్ చంద్రబాబు పై తీవ్ర పదజాలంతో ఆరోపణలు చేస్తూ, ముద్రగడ ఓ లేఖ రాశారు కూడా. ‘‘బ్రిటిష్‌ పాలనలో ఉన్న రిజర్వేషన్ల నుంచి ఏ కులాన్నయినా తొలగించారా? కానీ, దరిద్రపు జాతి పేదరికంలో ఉండి మగ్గటం వలన రోడ్లు ఎక్కి అడిగే పరిస్థితి లేకుండా పోయింది. స్వాతంత్య్రం ఈ దేశానికి వచ్చిందేమోకానీ, మా జాతికి రాలేదని భావిస్తున్నాను’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. దీక్ష ఉపసంహరణ సమయంలో కొత్తగా స్కాలర్‌షిప్‌లు, సబ్‌ప్లాన్‌ అంటూ బోగస్‌ హామీలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. 

English summary

Kapu Leader Mudragada Padmanabham writes a letter to Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu by demanding to release funds to Kapu Caste People.He gave dead line to Chandrababu Naidu upto March 10 .If not government responds then he will again starts Indefinite hunger strike at his home.