పవర్ స్టార్ కి ముద్రగడ ఫోన్

Mudragada Padmanabham make a phone call to Pawan Kalyan

10:41 AM ON 30th May, 2016 By Mirchi Vilas

Mudragada Padmanabham make a phone call to Pawan Kalyan

కాపులకు రిజర్వేషన్ ఇచ్చి తీరాలని పట్టు వీడని విక్రమార్కుడిలా పోరాడుతున్న మాజీ మంత్రి కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం ఆగష్టు తరువాత నుంచి కాపు రిజర్వేషన్ కోసం తమ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించిన నేపధ్యంలో ఇటీవల వరుసగా పలువురు నేతలను కలిసి మద్దతు సమీకరిస్తున్నారు. ఇందులో భాగంగా మొన్నటి రోజున మెగాస్టార్ చిరంజీవిని, దర్శకరత్న దాసరి నారాయణరావును హైదరాబాద్ లో కలిసి కాపు ఉద్యమానికి మద్దతునివ్వాలని ముద్రగడ కోరారు. ఇక ఆదివారం కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు ఇంటికి వెళ్లి ఆయన సపోర్టును కూడా అభ్యర్థించారు.

అదే సమయంలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్కు పళ్లంరాజు ఫోన్ చేశారని, ముద్రగడతో మాట్లాడించారని అంటున్నారు. కాపుల భవిష్యత్తు కోసం తను చేపట్టిన ఉద్యమానికి మద్దతునివ్వాలని పవన్ను ముద్రగడ కోరారని, ఇందుకు పవన్ కూడా సానుకూలంగా స్పందించారని అంటున్నారు. కాగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు 20 ప్రశ్నలతో కూడిన లేఖను ముద్రగడకు రాశారు. గత ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయనప్పుడు మీరెందుకు నిలదీయలేదని ఆయన ప్రశ్నించారు. కాపులంతా మీ వెనుకే ఉంటే రెండు సార్లు ఎందుకు ఓడిపోయారని అన్నారు. తుని విధ్వంసానికి బాధ్యులెవరో తెలపాలన్నారు.

English summary

Mudragada Padmanabham make a phone call to Pawan Kalyan