డైలాగ్ కింగ్ తో ఉద్యమ నేత మంత్రాంగం

Mudragada Padmanabham Meets Mohan Babu

11:51 AM ON 1st June, 2016 By Mirchi Vilas

Mudragada Padmanabham Meets Mohan Babu

మాజీ మంత్రి, కాపురిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వరుసగా పలువురు నేతలను కలుస్తున్నారు. రిజర్వేషన్ అంశం పై ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన ముద్రగడ పలువురు ప్రముఖులను కల్సి మద్దతు కోరుతున్నారు. అయితే తాజాగా ఈయన సినీనటుడు మోహన్ బాబుని కలిశారు. మోహన్ బాబు ఇంటికి వెళ్లిన ముద్రగడ, మోహన్ బాబు ఇచ్చిన ఆతిధ్యాన్ని స్వీకరించారు. ముద్రగడతో భేటీపై మీడియాతో స్పందించిన మోహన్ బాబు, ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదన్నారు. ముద్రగడతో తమ ఫ్యామిలీకి ఎంతోకాలం నుంచి మంచి అనుబంధం ఉందని అందులో భాగంగానే ఆయన్ను ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని ఆహ్వానించానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:చేతబడి గురించి మనకు తెలియని భయంకర నిజాలు..!

ఇవి కూడా చదవండి:పెళ్ళైనా ఆపేది లేదు... మరో ట్విస్ట్ ఇచ్చిన సమంత!

English summary

Kapu CasteLeader Mudragada Padmanabham Meets Collection King Actor Mohan Babu in Mohan Babu's House. Mohan Babu Said that he met Mudragada Padmanabham casually.