పోలీసు వాహనంలొనే ముద్రగడ ఆందోళన

Mudragada Padmanabham protest in police vehicle

06:18 PM ON 7th June, 2016 By Mirchi Vilas

Mudragada Padmanabham protest in police vehicle

కాపు ఉద్యమ నేత ముద్రగడను అమలాపురం నుంచి కిర్లంపూడిలోని ఆయన స్వగృహానికి తరలించిన పోలీసులకు షాక్ తగిలింది. కిర్లంపూడి చేరుకున్నాక ఆయనను వాహనం దిగాలంటూ పోలీసులు కోరగా నిరాకరించారు. బస్సు దిగనంటూ ఆయన మొండికేస్తూ, ఆందోళన చేపట్టారు. తుని ఘటనకు సంబంధించి అరెస్టు చేసిన వారిని విడుదల చేయండి.. లేదా నన్ను అరెస్టు చేయండి అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జిల్లా అదనపు ఎస్పీ దామోదర్, ఓఎస్డీ శివశంకర్రెడ్డి, పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్రావు పోలీసు వాహనంలోనే ముద్రగడతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.

తనకు మద్దతు తెలిపిన వారు దేశద్రోహులు, ఉగ్రవాదులు కారని, అలాంటి వారిని ఎందుకు అరెస్టు చేశారని ముద్రగడ ప్రశ్నించారు. వారు నిజంగా ముద్దాయిలని తేలితే.. తానే స్వయంగా వారిని పోలీసులకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయలేకపోతే తనను, తన అనుచరులను కూడా అరెస్టు చేసి జైలుకు పంపించాలన్నారు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేశారు. ముద్రగడకు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి ఆయన అనుచరులు కిర్లంపూడికి తరలివస్తుండటంతో పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు.

English summary

Mudragada Padmanabham protest in police vehicle