నెలాఖరు దాకా డెడ్ లైన్ విధించిన ముద్రగడ

Mudragada Padmanabham puts dead line for end of this month

02:13 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Mudragada Padmanabham puts dead line for end of this month

కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ఇప్పటికే కాపుల రిజర్వేషన్ అంశంపై, రైలు దగ్ధం కేసులో నింధితుల విడుడుదలకై రెండుసార్లు దీక్షకు దిగిన ఈయన మరోసారి పోరాటానికి సమాయత్తమవుతున్నారు. కాపులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చకపోతే మళ్ళీ ఉద్యమం ప్రారంభిస్తామని ప్రకటించారు. అందుకు డెడ్ లైన్ పెట్టారు. ఈ నెల 31లోగా టీడీపీ ప్రభుత్వం తన హామీలు నిలబెట్టుకోకపోతే ఉద్యమ ఉధృతికి కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. కాపుల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేయడంలేదని, మంజునాథ కమిషన్ రిపోర్టుపై ఇంకా తర్జనభర్జన పడుతున్నారని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో ముద్రగడ తిరిగి హైదరాబాద్ చేరుకొని తన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను కలుసుకుని చర్చించే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రముఖ దర్శకుడు దాసరి, మెగాస్టార్ చిరంజీవి వంటి వారిని ఆయన మళ్ళీ కలిసే అవకాశాలున్నాయని తెలిసింది. మూడు రోజుల హైదరాబాద్ పర్యటనలో ముద్రగడ, తన మలిదశ ఉద్యమానికి పకడ్బందీగా స్కెచ్ వేస్తారని వినిపిస్తోంది. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: పవన్ యాక్షన్ కి బాబు రియాక్షన్

ఇది కూడా చదవండి: దారుణం.. అత్తమామలే పడకగది దృశ్యాలు చిత్రీకరించి.. ఆపై...

ఇది కూడా చదవండి: బస్సులో భార్య చనిపోతే.. ఆతర్వాత ఏమైందో తెలుసా(వీడియో)

English summary

Mudragada Padmanabham puts dead line for end of this month