బాబుని నిద్రపోనివ్వనన్న ముద్రగడ(వీడియో)

Mudragada Padmanabham sensational comments on ChandraBabu Naidu

06:45 PM ON 30th August, 2016 By Mirchi Vilas

Mudragada Padmanabham sensational comments on ChandraBabu Naidu

కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఉద్యమానికి సమాయత్తం అవుతున్నారు. సెప్టెంబర్ 11న రాజమండ్రిలో 13 జిల్లాల కాపు సంఘీయులతో సభ నిర్వహించాలని, నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకోసం పలువురు నేతలను ఆయన కలుస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్ లో దర్శకరత్న డాక్టర్ మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు నివాసంలో కాపు సంఘం నేతలు భేటీ జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ముద్రగడ మాట్లాడుతూ, నేను ఎవరికీ బెధిరిపోయి ఉద్యమం ఆపను.. సీఎం చంద్రబాబును నిద్రపోనివ్వను అని తెలిపారు.

కాపు ఉద్యమం వెనుక జగన్ ఉన్నాడని కొందరు చెబుతున్నారు. జగన్ వయసు నా అనుభవమంత లేదు.. ఆయన నా వెనుక ఉండడం ఏమిటి? అదేం లేదు అని ముద్రగడ స్పష్టం చేశారు. మా ఉద్యమంలోకి రావాలని పవన్ కళ్యాణ్ ను అడగను.. ఆయన వస్తే మాత్రం కాదనను అని కూడా ముద్రగడ తెలిపారు. కాగా వచ్చే నెల 11న రాజమండ్రిలో కాపు అఖలిలపక్ష భేటీ సమావేశం జరగనుందని ముద్రగడ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలపై పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. మా జాతి ఓట్లతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మరోసారి ఆయన చెప్పుకొచ్చారు. మా కాపులకు అన్యాయం చేస్తే ఊరుకోమని చెప్పారు. నేను నక్సలైట్ కాదు.. తీవ్రవాదిని కాదని ఆయన అన్నారు.

1/3 Pages

ముద్రగడ పట్టువదలని విక్రమార్కుడన్న దాసరి

English summary

Mudragada Padmanabham sensational comments on ChandraBabu Naidu