అమలాపురంలో ఉద్రిక్తత - స్టేషన్ ఎదుట ముద్రగడ భైఠాయింపు

Mudragada Padmanabham Surrendered In Amalapuram Police Station

12:22 PM ON 7th June, 2016 By Mirchi Vilas

Mudragada Padmanabham Surrendered In Amalapuram Police Station

"ముందు నన్ను అరెస్ట్ చేయండి ఎ1 నేనే" అంటూ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించడంతో తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసు అధికారులు అదనపు బలగాలను తరలించారు. తుని ఘటనకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేయడంతో ముద్రగడ అభ్యంతరం వ్యక్తం చేశారు. అరెస్ట్ లకు నిరసనగా ముద్రగడ అనుచరులతో కలిసి ఇక్కడి పోలీస్ స్టేషన్ కు వచ్చి బైఠాయించారు. అరెస్ట్ చేసిన అమాయకులను తక్షణమే విడుదల చేయాలని కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అరెస్ట్ లు తమపరిధిలోకి రావు..సీఐడీ పరిధిలోకి వస్తాయని ముద్రగడ బృందానికి పోలీసులు చెబుతున్నారు. అరెస్ట్ లు ప్రారంభించారు కాబట్టి ప్రభుత్వంతో అమీతూమీ తేల్చుకొని ఉద్యమానికి ఊపు తేవాలని ముద్రగడ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.

ముద్రగడ ఆ మాటలన్నీ లెక్కచేయకపోవడంతో డీఎస్పీ అంకయ్య జోక్యం చేసుకుని, లొంగిపోవాలనుకుంటే సీఐడీ కార్యాలయానికి వెళ్లి లొంగిపోవాలని చెప్పారు. "కాపు ఉద్యమం ప్రారంభమైంది..ఉద్యమానికి పురిటిగడ్డ అమలాపురం కాబట్టి మేం సిఐడి కార్యాలయానికి పోయేదిలేదు" అని ముద్రగడ తేల్చిచెప్పారు. చట్టపరంగా మాకు హక్కులేదని సివిల్ పోలీసులు చెప్పారు. అరెస్ట్ అయిన వారికోసం వారి సంఘీబావం కోసం మేం లొంగిపోతున్నామని, అంతేకాకుండా ప్రభుత్వం తమ మీద చాలా కేసులు పెట్టింది కనుగ మమ్మల్ని ఇక్కడే అరెస్ట్ చేయాలని ముద్రగడ పట్టుబట్టారు.

అసలు ముద్రగడ పోలీస్ స్టేషన్ కు వస్తున్నట్లు నేతలకు గానీ, ఆఖరికి పక్కింటోళ్లకు కూడా తెలియనంత గోప్యత పాటించారు. ఉదయం తెల్లవారు జామునే కిర్లంపూడి నుంచి బయలుదేరి స్టేషన్ లో ప్రత్యక్షమయ్యారు. సీఐడీ, ఎస్పీ దగ్గరో ఆయన లొంగిపోతారని భావించిన పోలీసులు..అమలాపురం స్టేషన్ కు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఘటన జరిగింది తునిలో..ఈ కేసును ప్రభుత్వం సీవిల్ పోలీసుల నుంచి సీఐడీకి ఓ జీవో ద్వారా ట్రాన్స్ ఫర్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసే అధికారం ఒక్క సీఐడీకే ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి.

ఈ తాజా పరిణామాల నేపథ్యంలో అమలాపురం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. స్టేషన్ వైపు వాహనాలు వెళ్లనివ్వకుండా రాకపోకలను నిలిపివేశారు. భారీగా పోలీసులు మొహరించారు.ముద్రగడతో పాటు తాతాజీ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ ఇంకా పలువురు ముద్రగడ అనుచరులు స్టేషన్ ఎదుటే బైఠాయించారు.అయితే ముందస్తుగానే పోలీసులు అమలాపురం పోలీస్ స్టేషన్ సమీపంలో 144సెక్షన్ విధించారు.

కాగా తునిలో రైలు దహనం ఘటనకు సంబంధించి మంగళవారం ఉదయం సీఐడీ పోలీసులు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం పోలీసుస్టేషనుకు వచ్చిన నేపథ్యంలో తూర్పుగోదావరి ఎస్పీ రవిప్రకాశ్‌ను అమలాపురం వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అమలాపురంలో పరిస్థితిని ఎస్పీ ఉన్నతాధికారులకు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసు అధికారులు ముద్రగడతో చర్చించనున్నట్లు ఎస్పీ రవిప్రకాశ్‌ చెప్పారు. తుని కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులను కలవాలని ముద్రగడకు ఎస్పీ రవిప్రకాశ్ సూచించనున్నారు. తునిలో రైలు దహనం కేసులో సాక్ష్యాలు ఉన్నందునే అరెస్ట్‌ చేశామమని సీఐడీ అధికారులు చెపుతున్నారు.

ఇవి కూడా చూడండి: చెల్లినే కాటేసాడు...ఆ పై చెప్పుకోలేని చోట కర్రతో...

ఇవి కూడా చూడండి: స్టార్ హీరోలకు ఆ సత్తా లేదా అంటూ క్లాస్ పీకిన దాసరి

English summary

Kapu Leader Mudragada Padmanabham was surrendered in Amalapuram Police Station along with his followers and demanded to arrest him and to leave his followers who were arrested.