కాపు ఉద్యమానికి బాధ్యత వహిస్తూ  లేఖ

Mudragada Padnabham Letter To DGP Ramudu

04:15 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Mudragada Padnabham Letter To DGP Ramudu

తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపుగర్జన, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ జేవీ రాముడుకి లేఖ రాశారు. ఉద్యమం వెనుక తన జాతి, కుల నాయకులు, ఇతర పార్టీలు ఎవరూ లేరని, కాపు ఉద్యమానికి తానే పూర్తిగా నాయకత్వం వహించినట్లు లేఖలో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడగడానికే ఉద్యమం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. డీజీపీకి రాసిన లేఖ ప్రతిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ముద్రగడ పంపారు. జనవరి 31న తునిలో కాపు గర్జన నిర్వహించడం, అనంతరం తుని రైల్వే స్టేషన్ లో రైల్ రోకోకి దిగడం, ఈ సందర్భంగా ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ప్రెస్ని దగ్దం చేయడం, పోలీస్ స్టేషన్ల పై దాడికి దిగడం వంటి పరిణామాలు తెల్సినవే. ఆ తర్వాత తమ డిమాండ్ల సాధనకు ముద్రగడ ఆమరణ దీక్షకు దిగడం , ప్రభుత్వం తరపున మంత్రులు ,నేతలు వచ్చి ఇచ్చిన హామీ మేరకు దీక్ష విరమించడం జరిగాయి. అయితే రైల్ దహనం, పోలీస్ స్టేషన్ల పై దాడి ఘటనలో దోషులను గుర్తించి, అరెస్టుల పర్వం చేపట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దీక్ష సందర్భంగా అమాయుకల పై కేసులు పెట్టబోమని హామీ పొందిన ముద్రగడ ఇప్పుడు డిజిపి కి లేఖ రాయడం విశేషం.

English summary

Kapu Leader Mudragada Padmanabham wrote letter to Andhra Pradesh DGP J.V.Ramudu for that protest that have been done in Tuni for Kapu reservations on January 31st.In that letter he says that he was the reason behind that concern.