దీక్షకు దిగిన ముద్రగడ

Mudragada To Starts Strike Today

11:54 AM ON 9th June, 2016 By Mirchi Vilas

Mudragada To Starts Strike Today

తుని రైలు దహనం ఘటనలో నిందితులను విడుదల చేయాలని, కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండు చేస్తూ కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురువారం ఉదయం దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ, గతంలో తన దీక్ష విరమణ సమయంలో మూడు హామీలు ఇచ్చారని, ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. అమాయకులపై రౌడీషీటర్లని ముద్ర వేస్తున్నారని ఆయన విమర్శించారు. అరెస్టుల పర్వానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టానని ముద్రగడ చెప్పారు. అరెస్టులకు తాను భయపడనని, బెయిల్ కూడా తెచ్చుకోనని చెప్పారు. కాపు రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ముద్రగడ వివరించారు. గత జనవరిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దగ్దం కేసులో 7గురిని పోలీసులు అరెస్టు చేయడంతో, అరెస్టు చేసినవారిని వదిలిపెట్టాలని, లేని పక్షంలో దీక్షకు దిగుతానని ముద్రగడ డెడ్ లైన్ విధించారు. నిన్న సాయంత్రం వరకూ వేచి చూసిన ముద్రగడ ఈరోజు దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో భారీగా పోలీసులను మోహరించారు. కిర్లంపూడి వైపు వెళ్లే దారులను మూసివేశారు.

ఇది కూడా చూడండి:అంతరిక్షంలో అమీర్ అడుగు

ఇది కూడా చూడండి:ఐసియు లో చేరిన రజనీకాంత్... అసలు ఏమయింది ?

ఇది కూడా చూడండి:స్నేక్ వైన్ గురించి ఎప్పుడైనా విన్నారా(వీడియో)

English summary

Mudragada Padmanabham To Starts Strike Today.