100 కోట్ల వ‌రుడు కావాల‌న్న అమ్మాయికి ముఖేష్ అంబానీ దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్

Mukesh Ambani reply to Pooja Chauhan

02:44 PM ON 9th April, 2016 By Mirchi Vilas

Mukesh Ambani reply to Pooja Chauhan

ఏడాదికి 100 కోట్లు సంపాదించేవాడు మొగుడుగా కావాలని, అతనెక్కడుంటాడో చెప్పాలని పోస్ట్ పెట్టిన ఓ అందమైన యువతికి... వ్యాపార దిగ్గజం, రిలయన్స్ గ్రూప్ సంస్థల అధిపతి ముఖేష్ అంబానీ మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చారు. ముఖేష్ అంబానీ ఇచ్చిన ఓ రిప్లే సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ యువతి పెట్టిన పోస్టు ఏంటంటే, "నాకు ధనవంతుడు మొగుడిగా కావాలి.... నాకిప్పుడు 25 సంవత్సరాల వయసు, చాలా అందంగా ఉంటాను. మంచి అమ్మాయిని, సో నేను ఏడాదికి రూ. 100 కోట్లు సంపాదించే యువకుడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఏడాదికి రూ. 50 కోట్లు సంపాదిస్తున్న వారితో ఇప్పటికే నేను డేటింగ్ చేశా.

ఇవి కూడా చదవండి: శివలింగం రూపం వెనక ఉన్న గణిత శాస్త్రం

అయినా ఆ స్థాయి నాకు సరిపోదు. అందుకే అడుగుతున్నా..... ధనవంతులైన బ్రహ్మచారులు ఎక్కడ దొరుకుతారు? ధనవంతుల భార్యలంతా యావరేజ్ అందంతోనే ఉంటారెందుకు? ఇప్పటి వరకు నేను చూసిన ధనవంతులంతా యావరేజ్ అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు అంటూ పూజా చౌహాన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్‌పై తనదైన శైలిలో ముఖేష్ అంబానీ స్పందించిన తీరు ఓ సారి చూద్దాం. ప్రియమైన పూజా, 'నీ పోస్టు చాలా ఆసక్తిగా ఉంది. ఇలా ప్రశ్నించే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. ఓ ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ గా నీకు సమాధానం చెబుతున్నా.... నా వార్షికాదాయం రూ. 100 కోట్ల పైనే. కానీ నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు నా సమయం వృథా చేసుకోదలుచుకోలేదు.

ఇవి కూడా చదవండి: శివుడు పార్వతి ని పెళ్ళాడింది ఇక్కడే..

ఇక నీ విషయానికి వస్తే... నువ్వు అందాన్ని ఇచ్చి డబ్బు పొందాలని చూస్తున్నావు. అంటే నువ్వు అందాన్ని ఇస్తే, పుచ్చుకునే వాడు నిన్ను పొందేందుకు డబ్బు చెల్లించాలి. దాని వల్ల అతనికి ఎలాంటి లాభం లేదు. ఎందుకంటే ఇక్కడో ప్రధానమైన సమస్య ఏంటంటే, నీ అందం రోజురోజుకూ తరిగిపోతుంది. అతని ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. నీ అందం సంవత్సరం గడిచే కొద్దీ తగ్గుతుంది. ఇక ఆర్థిక కోణంలో పరిశీలిస్తే, అతడిది ఇక ఆర్థిక కోణంలో పరిశీలిస్తే, అతడిది పెరిగే ఆస్తి, నీది తరిగే ఆస్తి. అది కూడా వేగంగా తగ్గిపోతుంది. గరిష్ఠంగా పదేళ్లు మాత్రమే నీ అందం నీతో ఉంటుంది. ఐతే ఇది జరిగి 3 సంవత్సరాలు అవుతుంది.

ఇవి కూడా చదవండి: బ్రహ్మీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే, అది మంచి ఆలోచన ఎంత మాత్రమూ కాదు. విలువ పడిపోతున్న ఆస్తిని అమ్మేయాలి లేదా వదిలించుకోవాలి. ఎవరికైనా రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందంటే, అతడేమీ తెలివి తక్కువ వాడేమీ కాదు. అతను నీతో కేవలం డేటింగ్ మాత్రమే చేస్తాడు. నేను నీకిచ్చే సలహా ఏంటంటే, ధనవంతుడిని వివాహం చేసుకోవాలన్న ఆలోచన మానేయ్. నీకు నువ్వే రూ. 100 కోట్లు ఎలా సంపాదించాలో ఆలోచించు, ప్రయత్నించు. అప్పుడు నీ కోరిక నువ్వే తీర్చుకోవచ్చు. నా సమాధానం నీకు సహాయపడుతుందని ఆశిస్తున్నా' అంటూ ముఖేష్ అంబానీ రిప్లే ఇచ్చాడు. ఐతే ఇది జరిగి 3 సంవత్సరాలు అవుతుంది.

ఇవి కూడా చదవండి:

ఈ దేశాల్లో మన రూపాయి చాలా రిచ్

అమెరికాలో ‘సర్దార్‌' కాసుల వర్షం

సర్దార్ తల్లి అలాఅనేసారేంటి?

English summary

Mukesh Ambani reply to Pooja Chauhan. Reliance chairman Mukesh Ambani reply to Pooja Chauhan.