1.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టా.. చూస్తూ ఊరుకోను: ముఖేష్ అంబానీ సంచలన వ్యాఖ్యలు

Mukesh Ambani shocking comments on Airtel

01:19 PM ON 8th September, 2016 By Mirchi Vilas

Mukesh Ambani shocking comments on Airtel

ఐడియా, వోడాఫోన్, ఎయిర్టెల్ తదితర టెలికాం కంపెనీల వినియోగదారులకు రిలయన్స్ జియో నుండి నుంచి కాల్స్ వెళ్లడం లేదని వస్తున్న ఫిర్యాదులపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారంలో 5 కోట్లకు పైగా జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు వెళ్లిన కాల్స్ కనెక్ట్ కాకపోగా.. జియో సిమ్ లను తీసుకున్న వారు అసంతృప్తికి గురి అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖేష్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అది తాత్కాలికమేనని, సమస్యలన్నీ కొన్ని వారాల్లో పరిష్కారమవుతాయని.. అయినా అది చట్ట వ్యతిరేకమే అని అన్నారు. ఇంకా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ..

మార్కెట్లో నువ్వు (పేరును చెప్పకుండా ఎయిర్టెల్ ను ఉద్ధేశించి) ప్రముఖ స్థానంలో ఉన్నావు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నావు. ఒకటి లేదా రెండు సార్లు తప్పించుకోగలుగుతావేమో... మా ఉద్ధేశంలో ఇంటర్ కనెక్ట్ వ్యవహారం ఓ చిన్న సమస్య. అది కొన్ని వారాల్లోనే పరిష్కారం అవుతుంది. అంతకుమించి చట్టాన్ని నువ్వు అతిక్రమించలేవు. ట్రాఫిక్ తో సంబంధం లేకుండా ఇంటర్ కనెక్ట్ కు మద్దతివ్వాల్సిందే. అదే లైసెన్స్ నిబంధనల్లో ఉంది అని ముఖేష్ అంబానీ అన్నారు. అలానే.. ఒక్క రూపాయి కూడా ఆదాయాన్ని కోరుకోకుండా తాము 1.5 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టామని.. చట్ట వ్యతిరేకంగా, టెలికం లైైసెన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా టెల్కోలు ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

ఇప్పటికిప్పుడు జియో నుంచి లాభాలు కోరుకోవడం లేదని.. దీర్ఘకాలంలో మంచి ఆదాయం, లాభాలు వస్తాయని మాత్రం నమ్ముతున్నామని ముఖేష్ అంబానీ చెప్పారు. అలానే.. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో మౌలిక వసతుల షేరింగ్ డీల్ పై మాట్లాడుతూ.. గత విభేదాలను పక్కనబెట్టి తామిద్దరం చేతులు కలపడం తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. కుటుంబ పరంగానూ ఇది మంచి పరిణామమని.. వ్యాపారానికి చెందినంతవరకూ తామిద్దరమూ వేరువేరని.. ఇదే సమయంలో తామిద్దరి మూలాలూ ఒకటేనని ముఖేష్ అంబానీ అన్నారు.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఆత్మహత్యలు ఎక్కువగా ఈ దేశాల్లోనే జరుగుతున్నాయట!

ఇది కూడా చదవండి: చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న సింగర్

ఇది కూడా చదవండి: ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ అవసరం లేదు

English summary

Mukesh Ambani shocking comments on Airtel company.