రైల్వే ట్రాక్ పై విభీషణుడి మృతదేహంతో కలకలం

Mukesh Rawal dead body found on railway track

11:32 AM ON 17th November, 2016 By Mirchi Vilas

Mukesh Rawal dead body found on railway track

రామాయణ కాలం నాటి విభీషణుడు ఏమిటి రైల్వే ట్రాక్ పై చనిపోవడం ఏమిటి అనుకుంటున్నారా? ఇంచుమించు అలాంటి సంబంధం వుంది. ఎందుకంటే, కొన్ని అలానే ఉంటాయి. అంతకాదు కానీ ఆ పాత్ర పోషించిన పాపులర్ హీరో అతడు. బుల్లితెరపై ఒకప్పుడు సంచలనం రేపిన రామానంద్ సాగర్ రామాయణంలో ముఖేశ్ రావల్ విభీషనుడి పాత్ర పోషించారు. ఇంతకీ అతడు ఎవరంటే, ప్రముఖ నటుడు ముఖేశ్ రావల్.. అవును అతని మృతదేహం రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ముంబై బోరివలి రైల్వే ట్రాక్ పై ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. ఘాట్ కోపర్ ప్రాంతం నుంచి డబ్బు డ్రా చేసుకుని ఇంటికి బయలుదేరారని, ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయిందని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ముఖేశ్ రావల్ గుజరాత్ సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్ యాక్టర్. లహూ కే దో రంగ్, ఔజార్, మృత్యుదాతా, సత్తా వంటి హిందీ సినిమాల్లో కూడా నటించి పేరు తెచ్చుకున్నారు.

English summary

Mukesh Rawal dead body found on railway track