ములాయం ఫోన్ చేసి ఏడ్చేశారట ... ఇంతకీ ఎందుకో తెలుసా

Mulayam singh cried over phone

03:35 PM ON 4th February, 2017 By Mirchi Vilas

Mulayam singh cried over phone

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ తనయునితో గొడవ రావడం, చివరకు పార్టీ గుర్తు కూడా ములాయం కు కాకుండా కొడుకు అఖిలేష్ కి రావడం వంటి పరిణామాలు తెలిసినవే. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ , ఆర్ ఎల్ డీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు తొలుత చెప్పిన సమాజ్ వాదీ పార్టీ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగింది. దీంతో ఆర్ ఎల్ డీ ఇప్పుడు ఒంటరిగా పోటీచేస్తోంది. ఇదంతా ఇలా ఉంటే, పొత్తు కుదరక పోవడంతో ములాయం ఫోన్ చేసి ఏడ్చేశారట. ఈ విషయాన్ని ఆర్ ఎల్ డీ ప్రధాన కార్యదర్శి జయంత్ చౌధురి తాజాగా బయట పెట్టారు. అంతకుముందు తామేమీ కావాలని ఆ కూటమిలో చేరాలని అనుకోలేదని ఇక ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం ఫోన్ చేసి కంటతడి పెట్టడంతో తాము పొత్తుకు అంగీకరించామని జయంత్ అసలు విషయం చెప్పేసారు. ఆ కూటమిలో చేరనంత మాత్రాన తమ పార్టీ బలహీనమైపోలేదని ఆయన వ్యాఖ్యానించారు. మథురలో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మీ స్నేహితుడెవరైనా ఫోన్ చేసి ఏడ్చి, సాయం కోసం అభ్యర్థిస్తే.. చేయడం మానేస్తారా? అలానే ములాయం ఫోన్ చేసి పొత్తు పెట్టుకోవాలని కోరడంతో రెండు నిమిషాల్లో పొత్తు నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పారు. అంతే తప్ప కావాలని తామేమీ పొత్తుకు ముందుకు రాలేదన్నారు. తమ పార్టీ ఇప్పుడు మరింత బలంగా తయారైందని చెప్పారు. అనంతరం అఖిలేశ్ పైనా వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించారు. పెద్దఎత్తున ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్లు కాదని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులతో తరచూ పోట్లాడడం ఆయనకు అలవాటైన విషయమని దెప్పిపొడిచారు.

ఇది కూడా చూడండి: హిట్లర్ రహస్య స్థావరం ఎక్కడో తెలుసా

ఇది కూడా చూడండి: ఇక నుంచి అంత్యక్రియలు కూడా లైవ్ లో చూడొచ్చు

English summary

Akilesh Yadav father Mulayam singh Yadav cried on phone call and pleaded for help.