ఒకటైన తండ్రీ కొడుకులు - వీళ్ళను కలిపిందెవరో తెలుసా ?

Mulayam Singh Yadav Joined Hands With Akhilesh Yadav

10:47 AM ON 11th January, 2017 By Mirchi Vilas

Mulayam Singh Yadav Joined Hands With Akhilesh Yadav

మొత్తానికి గత కొన్ని రోజులుగా సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న తుపాన్ టీ కప్పులో తుపాన్ గా ముగిసింది. ఇన్నాళ్లూ ఎడమొహం, పెడమొహంగా ఉన్న తండ్రీ కొడుకులు ఒకటయ్యారు. దీంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఇక సత్తా చాటేందుకు సమాజ్ వాది పార్టీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ములాయం సింగ్ యాదవ్ ను ఆయన తనయుడు అఖిలేష్ కలిశారు. ములాయం నివాసంలోనే ఈ భేటీ జరిగింది. పార్టీ గెలిస్తే అఖిలేష్ సీఎం అని ములాయం రాజీ ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో ఆయన తనయుడు కూడా సయోధ్యకు ముందుకు వచ్చారు. ఇంతకీ సమాజ్ వాది పార్టీలో కుటుంబ కలహాలను చల్లార్చేందుకు ములాయం మనవరాలు మధ్యవర్తి పాత్ర పోషించిందట. అఖిలేష్ రెండవ కుమార్తె పదేళ్ల టీనాకు ఆ ఘనత దక్కనుంది.

కొన్నాళ్ల కిందట ములాయం తన మనవరాలు టీనాతో ‘మీ నాన్న మొండి’ అన్నారట. ఇదే విషయాన్ని టీనా తన తండ్రి అఖిలేష్ కు చెప్పింది. దానికి అఖిలేష్ కూడా నవ్వుతూ స్పందించారు. ఈ ఘటన తర్వాత అఖిలేష్ తన మనసు మార్చుకున్నారు. ఢిల్లీలో ఈసీని కలిసి లక్నో వస్తున్న ములాయంకు కుటుంబ సమేతంగా వెళ్లి స్వాగతం పలకాలని భావించారు. అయితే అఖిలేష్ తీవ్రంగా వ్యతిరేకించే అమర్ సింగ్ కూడా అదే విమానంలో ఉండడంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. తండ్రీ కొడుకుల మధ్య సయోధ్య కుదరడంతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. అఖిలేష్ సారధ్యంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పార్టీ వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. ఇక ఎన్నికల్లో ప్రచారం కొత్త పుంతలు తొక్కనుంది.

ఇవి కూడా చదవండి: బన్నీని రౌండప్ చేసిన పవన్ ఫ్యాన్స్ (వీడియో)

ఇవి కూడా చదవండి: కుండీలో చెత్త వేయండి - ఫ్రీ వైఫై ఇంటర్నెట్ పొందండి

English summary

Samazwadi Party founder Mulayam Singh Yadav and his son UP CM Akhilesh Yadav were opposed each other for past few days and now they were joined hands together in UP and the Samazwadi Party Leaders were in full happiness with their decision.