కలెక్టర్ కి తుపాకీ గురిపెట్టిన మాజీ మంత్రి(వీడియో)

Mullaivendan took gun at grievance meeting

12:59 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Mullaivendan took gun at grievance meeting

గతంలో అధికారులతో సఖ్యత కనబరుస్తూ, పనులు సాఫీగా చేయించుకునే పరిస్థితి కాస్తా, రానురాను బెధిరింపులకు పాల్పడే దాకా వెళ్ళింది. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగే దుస్థితి వచ్చేసింది. ఎవరు ఏం చేస్తున్నారో తెలీయని పరిస్థితి రాజ్యమేలుతోంది. అధికారంలో వున్నా, లేకున్నా ఈ తరహా దాడులకు తెగబడడం రివాజైపోయింది. మొన్న ఏపీలో, నిన్న మహారాష్ట్రలో జరిగినా... ఆ విషయంలో రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలూ ఉండకపోవడంతో వీటి పరంపర అలా కొనసాగుతూనే ఉంది. తాజాగా తమిళనాడులోని ఒక మాజీ మంత్రి ఈ లిస్టులో చేరాడు. ఏపీలో ఒకరు తహసిల్ధార్ పై దాడిచేస్తే.. మహారాష్ట్రలో మరొకరు డిప్యూటీ కలెక్టర్ చెంప చెళ్లుమనిపిస్తే.. ఈయనగారు ఏకంగా కలెక్టర్ కు తుపాకీ గురిపెట్టాడట. వివరాల్లోకి వెళ్తే..

1/3 Pages

తమిళనాడులోని ధర్మపురి కలెక్టర్ కార్యాలయంలో రైతుల సమస్య పరిష్కారాలకోసం ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ వివేకానందన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి సుమారు 500మంది రైతులు హాజరై తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవించుకున్నారు. ఈ సమావేశంలో రైతులతో పాటు మాజీ మంత్రి ముల్లైవేందన్ కూడా పాల్గొన్నారు. అనంతరం కాసేపు రైతు సమస్యలపై ప్రసంగించారు. ఈ క్రమంలో కంబైనల్లూర్ లోని సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్నాడీఎంకే ప్రముఖుడొకరు ఆక్రమించారని ఇదే సమయంలో కంబైనల్లూరు ప్రాంతంలో ఉచిత విద్యుత్ కొసం ఆ ప్రాంత రైతులు దరఖాస్తు చేసుకోగా, ఇంతవరకూ కనెక్షన్స్ రాలేదెందుకని ప్రశ్నించారు.

English summary

Mullaivendan took gun at grievance meeting