బాహుబలిని తలదన్నేలా 250 కోట్లతో మల్టీ స్టారర్

Multi Starrer movie with Mahesh Babu and Surya

11:26 AM ON 7th June, 2016 By Mirchi Vilas

Multi Starrer movie with Mahesh Babu and Surya

టాక్ లోనే కాదు, కలెక్షన్ల పరంగా కూడా మాంచి రేంజ్ కొట్టేసిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం క్రియేట్ చేసిందో, ఎన్ని అవార్డులు కొట్టిందో తెలిసిందే. జాతీయ స్థాయి ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన తొలి తెలుగు సినిమా కూడా ఇదే. మరి అంతటి సినిమాని తలదన్నే సినిమా వస్తుందన్న ఊహే ఎవరికీ రావడంలేదు. బాహుబలి లాంటి సినిమాలంటూ ఇప్పటివరకూ వచ్చిన కొన్ని సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాహుబలిని తలదన్నే సినిమా చేసేందుకు ప్రయత్నాలు రెడీ అయ్యాయని అంటున్నారు.

ఇందుకోసం సౌతిండియా సూపర్ స్టార్స్ మహేష్ బాబు, సూర్య హీరోలుగా ఓ మల్టీ స్టారర్ మూవీకి రంగం సిద్ధం అవుతున్నట్టు టాక్. ఇంతటి భారీ సినిమా చేయడానికి తమిళ దర్శకుడు సుందర్ సి సన్నద్ధమవుతున్నాడు. సుమారు 250 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ సినిమా తమ వందో చిత్రంగా శ్రీ థెనాందల్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ విషయాన్ని సుందర్ సి భార్య కుష్బూ దృవీకరిస్తూ, శ్రీ థెనాందల్ ఫిల్మ్స్ సంస్థలో సుందర్ సి ఓ భారీ సినిమా చేయనున్నారు. ఆయనెప్పుడూ ఓ మంచి సినిమాని ప్రేక్షకులకివ్వడానికే ప్రయత్నిస్తారు అని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

అయితే, కాస్టింగ్ ఇంకా ఫైనల్ కాలేదని వెల్లడించింది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తైన ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా 24 సినిమా చేసిన తిరు, బాహుబలి మూవీకి పనిచేసిన సాబు సిరిల్, కమల్ కన్నన్ కూడా భారీ మూవీలో భాగం కానున్నారు. సంగీత దర్శకుడిగా ఎ.ఆర్. రెహమాన్, ఇళయరాజా పేర్లు పరిశీలనలో ఉన్నాయట. మొత్తానికి బాహుబలి అందరికీ టార్గెట్ అయింది.

English summary

Multi Starrer movie with Mahesh Babu and Surya