డిక్టేటర్‌తో 'ముమైత్‌ఖాన్‌'!

Mumaith Khan item song in Dictator movie

06:16 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

Mumaith Khan item song in Dictator movie

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం 'డిక్టేటర్‌'. 'లౌక్యం' ఫేమ్‌ శ్రీవాస్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్‌ చౌహన్‌, అక్ష ముగ్గురు కథానాయికలు నటించారు. ఎస్‌ఎస్‌. థమన్‌ సంగీతం అందించన ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే అమరావతిలో అంగరంగ వైభవంగా విడుదలయ్యాయి. అయితే డిక్టేటర్‌ టాకీ పార్ట్‌ భాగం మొత్తం షూటింగ్‌ అయిపోయింది. కానీ ఇంకా ఇందులో వచ్చే ఒక ఐటమ్‌ సాంగ్‌ మాత్రం ఇంకా పూర్తికాలేదు. ఈ ఐటమ్‌ సాంగ్‌ కోసం తొలుత ఇలియానా, నయనతార, శ్రద్ధదాస్‌ అనే పేరులు వినిపించినా చివరికి హాట్‌బాంబ్‌ ముమైత్‌ఖాన్‌ని ఎంచుకున్నారు.

ఆ సాంగ్‌ షూటింగ్‌ రేపటి నుండి (డిసెంబర్‌ 23) హైదరాబాద్‌లో వేసిన ఒక సెట్‌లో చిత్రీకరించనున్నారు. ఈ సాంగ్‌తో మొత్తం డిక్టేటర్‌ షూటింగ్‌ పూర్తవుతుంది. ఈ చిత్రానికి కథ,స్క్రీన్‌ప్లే కోన వెంకట్‌, గోపిమోహన్‌ అందించగా దర్శకుడు శ్రీవాస్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్ధ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

English summary

Mumaith Khan item song in Dictator movie. This item song shoot will starts from tomorrow onwards in Hyderabad.