రాజ్ తో దస్తూర్ జోడీ ...

Mumbai beauty Amyra Dastur to debut in Telugu

11:37 AM ON 1st July, 2016 By Mirchi Vilas

Mumbai beauty Amyra Dastur to debut in Telugu

ఎవరు ఎవరి పక్కన జోడీ కడతారో చెప్పలేం. అన్నీ అలా జరిగిపోతుంటాయి అని సినీ ఇండస్త్రీలో తరచూ వినిపించే టాక్. అందుకు తగ్గట్టుగానే టాలీవుడ్ లో నటించాలన్న ముంబై బ్యూటీ అమైరా దస్తూర్ కోరిక త్వరలో నెరవేరనుంది. హిందీ, తమిళం మూవీస్ లో చేసినా సరైన బ్రేక్ రాలేదు. తొలిసారి హీరోయిన్ గా ఛాన్స్ సొంతం చేసుకుంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ పక్కన హీరోయిన్ గా కనిపించనుంది. డైరెక్టర్ మారుతి పర్యవేక్షణలో సంజనా ఈ మూవీని డైరెక్ట్ చేస్తోంది. ఇందులో అమైరాను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు టాక్. ఇందుకు రెమ్యూనరేషన్ బానే ముట్టజెప్పినట్టు ఇన్ సైడ్ సమాచారం.

గతంలో కొంతమంది దర్శకనిర్మాతలు ఈమెని సంప్రదించారు.. ఎందుకోగానీ సినిమాలు చేయలేదు. ప్రజెంట్ రాజ్ తరుణ్ పక్కన నటించడానికి ఓకే చేసినట్టు చెబుతున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో కీలకమైన రోల్ కి రాజేంద్ర ప్రసాద్ ను తీసుకున్నారు. అంతా సెట్టయితే వచ్చేనెల నుంచి సైట్స్ పైకి వెళ్లడం దాదాపు ఖాయమట.

ఇది కూడా చూడండి: కోడిగుడ్డుతో..3 రోజుల్లో 3 కిలోలు తగ్గండి

ఇది కూడా చూడండి: అచ్చం మీలా ఉన్నవారు ఎక్కడున్నారో చూడాలనుందా.!

ఇది కూడా చూడండి: రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

English summary

Mumbai beauty Amyra Dastur set to make her debut in Telugu.