శోభనం జరిగినట్లు నిర్ధారించే పరీక్షలు కరెక్టేనన్న కోర్టు

Mumbai court shocking judgement

02:52 PM ON 10th September, 2016 By Mirchi Vilas

Mumbai court shocking judgement

శోభనం జరిగిందో, లేదో నిర్ధారించేందుకు భార్యకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను బోంబే హైకోర్టు సమర్థించింది. వివరాల్లోకి వెళ్తే.. శోభనం జరగలేదని, విడాకులు ఇవ్వాలని 2011లో దాఖలైన పిటిషన్ పై గత జూలైలో ముంబై కుటుంబ న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. ముంబైలోని సర్ జేజే ఆసుపత్రికి చెందిన మెడికల్ బోర్డు చేత శారీరక, మానసిక వైద్య పరీక్షలు చేయించుకోవాలని భార్యను ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ ఆమె బోంబే హైకోర్టును ఆశ్రయించింది. విడాకుల పిటిషన్ విచారణ సందర్భంగా భార్య తాను 2011లో పెళ్ళి జరిగిన తర్వాత అనేకసార్లు తన భర్తతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు సాక్ష్యం ఇచ్చింది.

దీనిని వ్యతిరేకిస్తూ జూలైలో ఆ భర్త ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టును కోరాడు. 2010లో వీరిద్దరికీ వివాహం జరిగింది. ఆమె వయసు 33ఏళ్ళు, ఆయన వయసు 38 ఏళ్ళు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. ఆమె లైంగిక సామర్థ్యం లేనివారా, కాదా అనే అంశాన్ని పరీక్షించి, నివేదిక ఇవ్వాలని ముంబై కుటుంబ న్యాయస్థానం మెడికల్ బోర్డును ఆదేశించింది. దీనిని ఆమె వ్యతిరేకిస్తూ హైకోర్టులో అపీలు చేసింది. అపీలును విచారించిన హైకోర్టు కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థించింది.

ఇది కూడా చదవండి: అబ్బాయిలతో సన్నిహితంగా ఉందని చెల్లిని హత్య చేసారు

ఇది కూడా చదవండి: శివుని అర్ధనారీశ్వర రూపం వెనుక అసలు రహస్యం ఇదే!

ఇది కూడా చదవండి: ప్యాకేజీపై పంఛ్ పేలింది

English summary

Mumbai court shocking judgement