ఆ ఫామిలీపై దెయ్యం దాడి చేసిందట

Mumbai Family Complains Ghost Attacks In Hyderabad

11:43 AM ON 25th January, 2017 By Mirchi Vilas

Mumbai Family Complains Ghost Attacks In Hyderabad

దెయ్యాలు ఉన్నాయా లేదా అనే చర్చ ప్రతిచోటా జరుగుతూనే ఉంటుంది. అయితే, ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ కుటుంబం తమపై ఏకంగా దెయ్యం దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాత బస్తీ చార్మినార్ దగ్గరి ఓ లాడ్జిలో తాము బస చేయగా, శనివారం రాత్రి తలలేనిమొండెంతో ఎవరో వచ్చి తమపై దాడి చేసినట్టు 60 ఏళ్ళ సయ్యద్ ముస్తాక్ అనే వ్యక్తి, అతని కొడుకు హబీబ్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్నారు.

తాము ఆ ఘోస్ట్ ని ఎదుర్కోనబోగా తమ తలలను గోడకేసి కొట్టిందని అన్నారు. అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అలాంటిదేమీ కనబడలేదు. పైగా వారి శరీరం మీద గాయాలు కూడా కనబడలేదు. ముంబై నుంచి 8 మంది సభ్యులతో కూడిన ఈ ఫ్యామిలీ చెబుతున్నదాన్ని పోలీసులు నమ్మనప్పటికీ ఆ లాడ్జిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అలాంటిదేమీ జరగలేదని నిర్ధారించారు. ఈ తతంగం తర్వాత ఆ కుటుంబం వీరికి చెప్పకుండానే మరో లాడ్జికి షిఫ్ట్ అయింది. ఇంతకీ కారణం మాత్రం తెలీలేదు.

ఇవి కూడా చదవండి: పూజలో రాగిపాత్రలను వాడడం వెనుక అసలు రహస్యం ఇదే

ఇవి కూడా చదవండి: 2017 లో మన జాతకం ఇలా ఉంటుందట

English summary

Mumbai Family Complains Ghost Attacks In Hyderabad.