సల్మాన్ ని నిర్దోషి గా ప్రకటించిన ముంబై  హై కోర్టు    

Mumbai High Court Declares Salman as Innocent

01:52 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Mumbai High Court Declares Salman as Innocent

హమ్మయ్య, గత 13 ఏళ్లుగా బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ని వెంటాడుతున్న కేసులో విముక్తి లభించింది. సల్మాన్ ని దోషిగా నిర్ధారించలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. దీంతో సల్మాన్ కి ఈ కేసులో ఊరట లభించింది.

వివరాలలోకి వెళితే , 2002 హిట్ అండ్ రన్ కేసు సల్మాన్ ఖాన్ ని వదిలిపెట్టకుండా వెంట తరుముతోంది. . ఆల్కహాల్ తాగి ఫుట్ పాత్ పై నిదురిస్తున్న వారిపైనుంచి కార్ ని తోలి , ఒకరి మృతికి కారకుడయ్యా డని అబియోగం. ఆ ఏడాది సెప్టెంబర్ 28న బాంద్రా పోలీసులు సల్మాన్ ని అరెస్టు చేసారు. అక్టోబర్ 24న బెయిలు మంజూరు చేసారు. .ఆరోజు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రవీంద్ర పాటిల్ మాత్రమే. 2002లో ఘటన జరిగిన వెంటనే అతడు ఇచ్చిన సాక్ష్యాన్ని పోలీసులు రికార్డు చేశారు. ట్రయల్ కోర్టులో సల్మాన్ కి 5 సంవత్సరాల శిక్ష విధిస్తూ, ఈ ఏడాది మే 6న తీర్పు రావడంతో , రెండు రోజులు జైలు లో వున్నాడు. అప్పడు బాంబే కోర్టులో మే 8న అప్పీలు చేయడంతో జైలు శిక్ష రద్దు చేస్తూ , బెయిలు మంజూరు చేసింది.

అయితే , అప్పట్లో సల్మాన్ తాగి డ్రైవ్ చేశాడు అన్న సంగతిని అతడు చెప్పలేదు. సల్మాన్ తాగి ఉన్నాడన్న సంగతి వైద్యులు రక్త పరీక్ష చేసి తేల్చారు తప్ప అతడు వాంగ్మూలంలో చెప్పనేలేదు.

ఈ కేసులో వ్యక్తిగతంగా సల్మాన్ హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో సల్మాన్ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా కోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేసారు. కేసు ఏమౌతుందో నని సల్మాన్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. చివరకు అభియోగం నిరూపణ కాలేదని , అందుచేత సల్మాని ని దోషిగా నిర్ధారించలేమని హైకోర్టు వ్యాఖ్యానిస్తూ నిర్దోషిగా ప్రకటించడంతో సల్మాన్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.

English summary

Mumbai High Court Declares Salman as Innocent in hit and run case in year 2002. High Court says that prosecuters were not able to prove that incident with the proper proofs