లక్ష్మీపుత్రులలో ముంబాయి రికార్డు 

Mumbai In 12th Place In Billionaries

11:37 AM ON 25th January, 2016 By Mirchi Vilas

Mumbai In 12th Place In Billionaries

భారతదేశ రాజధాని డిల్లీతో ఆర్థిక రాజధాని ముంబయి బానే పోటీ పడుతోంది. రెండు చోట్లా లక్ష్మీ పుత్రులు బాగా పెరుగుతున్నా, డిల్లీ కన్నా ముంబాయిలోనే కోటీశ్వరుల సంఖ్య విపరీతంగా వుందని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచంలో ముంబాయ్ 12వ స్థానంలో వుండగా , డిల్లీ 20వ స్థానంలో వుంది. అయితే గత పదిహేనేళ్లలో ఈ రెండు నగరాల్లో సంపన్నుల సంఖ్య 300శాతానికి పైనే పెరిగింది. అందుకే ఆసియా పసిఫిక్‌ దేశాల్లోనే అత్యధిక ధనవంతులు ఉన్న నగరాల జాబితాలో ఇవి చేరాయి.

ఆసియా పసిఫిక్‌ దేశాల్లో 2016 సంవత్సరానికి అత్యధిక సంపన్నులున్న నగరాలపై వెల్త్‌ రిపోర్ట్‌ విడుదలైంది. దీని ప్రకారం 2.64లక్షల మంది మిలియనీర్లతో జపాన్‌ రాజధాని టోక్యో ప్రథమ స్థానంలో ఉంది. ఈ జాబితాలో 41,200 మంది సంపన్నులతో ముంబయి 12వ స్థానంలో వుంటే, 20,600 మందితో డిల్లీ 20 స్థానంలో వుంది. పెరుగుతున్న ఆర్థిక వనరులు, వ్యాపారావకాశాలతో 2025 సంవత్సరానికి ఈ నగరాలు మొదటి మూడు స్థానాల్లో ఉండవచ్చని రిపోర్ట్‌ వెల్లడించింది. ఇక దేశ రెండో రాజధాని గా పేర్కొనే హైదరాబాద్‌లో 510మంది మిలియనీర్లు ఉన్నట్లు నివేదికలో వున్నట్లు నివేదిక తేల్చింది. భవిష్యత్తులో భాగ్యనగరం ఆ పేరుని సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదేమో అంటున్నారు ఆర్ధిక విశ్లేషకులు.

English summary

According to a survey that says Mumbai has highest number of celebrities more than Delhi. In that survey Mumbai was in 12th place with 41,200 billionaires and Delhi was in 20th place with 20,600 billionaires and Tokyo was in first place with 2.64 lakhs billionaires