ట్రంప్ గెలుపు కోసం భారత్ లో హోమాలు!

Mumbai temple performs special havan for Donald Trump

12:04 PM ON 9th November, 2016 By Mirchi Vilas

Mumbai temple performs special havan for Donald Trump

అవును అక్కడ ఎన్నికలు ఇక్కడ గెలుపుకోసం హోమాలు... అవును, పైగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరితో తలపడుతున్న డోనాల్డ్ ట్రంప్ విజయం కోసం. నిజంగా ట్రంప్ విజయం సాధించాలని కాంక్షిస్తూ ముంబై దేవాలయాల్లో పూజలు, హోమాలు చేశారు కొంతమంది ఎన్నారైలు. వినడానికి వింతగా వున్నా ఇది నిజంగా జరిగింది. ట్రంప్ గెలుపు కోసం భారత్ లోవున్న ఎన్నారైలు పూజలు, హోమాలు చేయాలన్నది యూఎస్ లోని ఎన్నారైల కోరిక అట. ఆ మేరకు నిర్వహించామని ముంబైలోని విష్ణుథామ్ దేవాలయ ట్రస్టీ రమేష్ జోషి అంటున్నారు. ట్రంప్ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ సాయిథామ్ దేవాలయంలోనూ ప్రత్యేక హోమాలు జరిగాయి.

అలాగే నార్త్ ముంబైలోని ఖాండ్వీ సబర్బన్ ప్రాంతంలోని టెంపుల్ ని ఇండియా వచ్చినపుడల్లా సందర్శించే యూఎస్ విజిటర్లు ట్రంప్ విజయం కోసం మూడుగంటలపాటు విజయప్రాప్తి, శాశనప్రాప్తి యగ్నాలు, పూజలు నిర్వహించినట్టు జోషి తెలిపారు. అంతేకాకుండా ట్రంప్ విన్నరైతే ఇండియాలో ఇస్లామ్ టెర్రరిజాన్ని కట్టడి చేయడంలో హిల్లరీ కంటే ట్రంప్ సమర్ధవంతంగా పని చేయగలరన్న నమ్మకం తమకుందని చెప్పారు జోషి. అందుకే ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించినట్టు చెప్పుకొచ్చారు.

English summary

Mumbai temple performs special havan for Donald Trump