చితకొట్టి చంపేసి పడేసారు - ఇప్పుడు పోలీసులకు దొరికేసారు

Murder in Rajamahendravaram

06:02 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Murder in Rajamahendravaram

ఇరువర్గాలకు పాత గొడవలు ఉన్న కారణంగా ఓ వ్యక్తిని దారుణంగా చంపేసి పడేసిన కేసుని పోలీసులు చేధించారు. రాజమహేంద్రవరం రాజేంద్రనగర్కు చెందిన ధనాల రమేష్ ను ఆదెమ్మ దిబ్బకు చెందిన కరణం శివ, అతని స్నేహితులు హత్య చేసారు. ఈమేరకు ఈ హత్య కేసులో నింధితులైన కరణం శివ, చల్లా భరత్, చల్లా శరత్, గారా రవితేజ, వెంట్రపాటి మహేష్, లావేటి ఉమా మహేష్, దల్లి మురళి, యర్రా సాయికిరణ్, లాలం తరుణ్, మంత్రి రాము, లద్ధిక చైతన్యలను సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియా ముందుకు అర్బన్ జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా ఎస్పీ రాజకుమారి తెలిపిన వివరాలిలా వున్నాయి. ధనాల రమేష్తో పాత గొడవలు ఉన్న కారణంగా కరణం శివ, అతని స్నేహితులు గత నెల 26న ఉదయం 10 గంటల సమయంలో సుబ్రహ్మణ్య మైదానానికి చేరుకుని సమావేశమై ధనాల రమేష్ ను, అతని స్నేహితులను పట్టుకుని చంపాలని నిర్ణయించుకున్నారు. వారిలో నలుగురు ఆటోలోనూ, ఇద్దరు మోటార్ సైకిల్ పై వెళ్ళి ప్రకాశంనగర్ లోని ఆసుపత్రి సమీపంలో ఉన్న ఆటోస్టాండ్ వద్దకు వెళ్ళేసరికి ధనాల రమేష్ వీరికి దొరకడంతో అతనిని అక్కడే కొట్టి తీవ్రంగా గాయపర్చి ఆటోలో ఆదెమ్మ దిబ్బకు తీసుకెళ్ళి కరణం శివ ఇంటికి తీసుకువచ్చారు.

అక్కడ మరోసారి తీవ్రంగా గాయపర్చడంతో ధనాల రమేష్ చనిపోయాడని నిర్ధారణకు వచ్చి అతని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి వెనుక పడేసి పరారయ్యారు. మృతుని తండ్రి విషయం తెలుసుకుని త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి, ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని అడిషనల్ ఎస్పీ రెడ్డి గంగాధర్ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ డిఎస్పీ కులశేఖర్, ఇతర సిబ్బంది కృషి చేసి నింధితులను అరెస్ట్ చేశారు. నింధితులు ఉపయోగించిన ఆయుధాలను, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నింధితుల్లో వెంట్రపాటి మహేష్, కరణం శివల పై వివిధ కేసులు నమోదై ఉన్నాయి.

నింధితులైన 11 మంది ఆటోడ్రైవర్లుగా ఉన్నారు, వీరు లైసెన్సులు కలిగి ఉన్నారో లేదో పరిశీలించి ఉంటే వాటిని రద్దు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

English summary

Murder in Rajamahendravaram