బ్యూటి లను ఎరచూపి మరీ హత్యలు .....

Murders By Showing Beautiful Girls

02:23 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Murders By Showing Beautiful Girls

డబ్బుకోసం ఏపనైనా చేయడానికి వెనుకాడని పాడు కాలం ఇది. దోపిడీలు , ఖూనీలు పెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా అందమైన యువతులను ఆశ చూపించి హత్యలు చేసిన గ్యాంగ్‌ బండారం బయట పడింది. ఈ ముఠాను శ్రీకాళహస్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, 2015 డిసెంబర్ 23వ తేదీన శ్రీకాళహస్తీలోని ఓ లాడ్జిలో శ్రీనివాస్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సంచలనం సృష్టించిన ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు శ్రీకాళహస్తి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయున్, సత్యా రామచంద్రన్ జంటను అదుపులోకి తీసుకుని విచారించగా అవాక్కయ్యే నిజాలు తొంగిచూశాయి.

విజయున్, సురేష్ అనే ఇద్దరు సత్యా రామచంద్రన్ అనే యువతిని పలువురికి ఆశ చూపించి బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారని, ఎదురుతిరిగిన వారిని హత్య చేస్తున్నారని విచారణలో తేలింది. శ్రీనివాస్‌ను కూడా వీరే హత్య చేసినట్లు విచారణలో అంగీకరించారు. డిసెంబర్ 22వ తేదీన శ్రీకాళహస్తిలోని నగిరి వీధిలో ఓ లాడ్జిలో రూమ్‌ని అద్దెకు తీసుకున్న వీరిద్దరూ , పక్కరూమ్‌లో ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తిపై గురిపెట్టారు. వెనువెంటనే రంగంలోకి దిగారు. శ్రీనివాస్ ను స్వయంగా విజయన్ పరిచయం చేసుకుని సత్యను ఎర వేసాడు. ఆమెను చూసిన శ్రీనివాస్ కి దిమ్మ తిరిగింది. ఆమె అందం సొంతం కావాలనుకుని, వాళ్ళు విసిరిన వలలో చిక్కుకున్నాడు.

ఇంకేముంది .... ఆ తర్వాత శ్రీనివాస్ వద్ద ఉన్న రూ.6 వేలు నగదు, సెల్‌ఫోన్‌ను ఇవ్వాలని బెదిరించారు. శ్రీనివాస్ ప్రతిఘటించడంతో హత్య చేసేసారు. అయితే, అప్పుడు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు అప్పట్లో పెద్దగా ఆధారాలేవీ దొరకలేదు. తాజాగా శ్రీకాళహస్తి మండలంలోని తొండవునాడు క్రాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయున్, సత్యారామచంద్రన్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిచడంతో అసలు విషయం కక్కారు.

ఈ హత్య లో వీరిద్దరితో పాటు సురేష్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడని, గతంలో వీరు చేసిన హత్యలపై దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. కేసును త్వరగా ఛేదించిన కానిస్టేబుళ్లు గోపి, చంద్రశేఖర్, సుబ్రమణ్యంలను డీఎస్పీ అభినందించారు. గుర్తింపు ఉంటేనే గదులు అద్దెకు ఇవ్వాలని కూడా లాడ్జీ నిర్వాహకులను డిస్పీ ఆదేశించారు. చూసారుగా .... ఇలాంటి వలలో పడకండీ.... పారా హుషార్ ....

English summary

A gang in Sri Kalahasthi was murdering innocent people by showing beautiful girls.Recently this gang was caught by police and they accepted that they have murdered srinivas who was murdered previously in a lodge