ఏప్రిల్లో 'బ్రహ్మోత్సవం' - తదుపరి మూవీ దీపావళికి

Murugadoss Mahesh Movie To Be Released To Diwali

11:37 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Murugadoss Mahesh Movie To Be Released To Diwali

ఏదైనా పక్కాగా ఉండాలనేది ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్లాన్. అందుకు అనుగుణంగా కార్యరంగంలోకి దూకేస్తున్నాడు. ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ తదుపరి మూవీ కోసం రెడీ అయిపోతున్నాదట. 'బ్రహ్మోత్సవం' అద్భుతమైన కుటుంబ బాంధవ్యాలతో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని కొన్ని ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సీన్స్ ని ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. రీసెంట్ గా సమంత కూడా షూటింగ్ లో చేరింది. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తమిళ స్టార్ డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో ఓ భారీ బడ్జెట్ ద్విభాషా చిత్రం చేయడానికి అంగీకారం కుదిరిన నేపధ్యంలో ఈ కొత్త చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభించబోతున్నాడు.

మార్చి నాటికి బ్రహ్మోత్సవం షూటింగ్ ని పూర్తి చేసి, వెనువెంటనే ఏప్రిల్ లో మహేష్ బాబు మురుగదాస్ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేస్తారట. మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో మురుగదాస్ సినిమా తెరకేక్కిస్తున్నారట. ఎన్.వి ప్రసాద్ – ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి హారీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టి, సిక్స్ మంత్స్ లో అంటే సెప్టెంబర్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసేసి, అక్టోబర్ చివర్లో రానున్న దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నాడట. అందుకే షూటింగ్ మొదలయ్యాక ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని స్క్రిప్ట్, కాస్టింగ్ లొకేషన్స్ ని పక్కాగా ఫిక్స్ చేస్తున్నారు. అంటే మహేష్ బాబు ఈ ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట. గతంలో మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా పక్కా ప్రణాళికతో చిత్రాలను అందించిన సంగతిని అభిమానులు గుర్తుచేస్తున్నారు.

English summary

Super Star Prince Mahesh Babu was planning to release his next movie after Brahmotsavam movie to this Diwali.This movie was going to be directed by Director A.R.Murugadoss. This movie was going to be film in both Telugu And Tamil At A Time