మహేష్‌ తర్వాతే సల్మాన్‌ అట!!

Murugadoss want to direct the Salman Khan's movie after completion of Mahesh Babu movie

01:57 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Murugadoss want to direct the Salman Khan's movie after completion of Mahesh Babu movie

మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్‌ చిత్రం వి.వి. వినాయక్‌ తీసినా ఆ చిత్రానికి కధ అందించింది ఎ.ఆర్‌. మురుగదాస్‌. ఆ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌. ఆ తరువాత సూర్యతో గజిని వంటి సూపర్‌హిట్‌ చిత్రం తీసి దర్శకుడిగా పాపులర్‌ అయ్యాడు మురుగదాస్‌. ఇదే చిత్రాన్ని అమీర్‌ఖాన్‌ తో హిందీలో తీసాడు. అక్కడా ఇది సూపర్‌హిట్‌ అవ్వడంతో మురుగదాస్‌ బాలీవుడ్‌లో కూడా పాపులర్‌ అయ్యాడు. ఆ తరువాత హిందీలో 'హాలిడే' చిత్రం తీసాడు అదీ కూడా సూపర్‌హిట్‌. దీనితో మురుగదాస్‌ బాలీవుడ్‌లో మోస్ట్‌వాంటెడ్‌ డైరెక్టర్‌ అయ్యారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే మురుగదాస్‌ ప్రస్తుతం సొనాక్షి సిన్హా తో 'అకీరా' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

ఆ తరువాత మహేష్‌బాబుతో ఒక చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. ఇదే కాకుండా బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో కూడా ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. మురుగదాస్‌ ఇటీవలే సల్మాన్‌కి ఒక కధ వినిపించారట సల్మాన్‌కి అది విపరీతంగా నచ్చడంతో కధని డెవలెప్‌ చెయ్యమని గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారట. 2016 ద్వితీయార్ధంలో ఎలా అయినా ఈ సినిమా కంప్లీట్‌ చెయ్యాలని సల్మాన్‌ చెప్పారట. మురుగదాస్‌ 2016 ప్రధమార్ధంలో మహేష్‌తో మూవీ కంప్లీట్‌ చేసి ఆ తరువాత సల్మాన్‌తో తీస్తారట. అంటే మహేష్‌ తర్వాతే సల్మాన్‌.

English summary

Murugadoss want to direct the Salman Khan's movie after completion of Mahesh Babu movie. Now MurugaDoss is directing Akhira movie with Sonakshi Sinha.