నైట్ క్లబ్ లో అడ్డంగా దొరికేసిన ముషారఫ్

Musharraf was caught to the media in the Night Club

11:33 AM ON 24th January, 2017 By Mirchi Vilas

Musharraf was caught to the media in the Night Club

ఒకప్పుడు పాకిస్థాన్ జనరల్ గా ఉంటూ, అధికారం దక్కించుకుని సైనిక పాలన మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అడ్డంగా దొరికిపోయారు. గుర్తు తెలియని ఓ మహిళతో నైట్ క్లబ్బులో ఆయన చిందులేశారు. ప్రస్తుతం ఆయన దుబాయ్ లో వుంటున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ ‘యే జవానీ హై దీవానీ లోని ఓ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

పాక్ టెలివిజన్ టాక్ షో వ్యాఖ్యాత హమీద్ మిర్ ఈ డ్యాన్స్ వీడియోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. గతంలో ఈయన ముషారఫ్ కి సంబంధించి మరో వీడియో కూడా పోస్ట్ చేశాడు. అందులో తన భార్య సెహ్బా తో కలసి ముషారఫ్ స్టెప్పులేశారు. రాజద్రోహం కేసును ఎదుర్కొంటున్న ముషారఫ్.. ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్ నుంచి గతేడాది పాక్ ప్రభుత్వం తొలగించిన విషయం తెల్సిందే!

ఇది కూడా చూడండి : రోజుకి 100 వెంట్రుకల కంటే ఎక్కువ రాలితే ఏం చేయాలో తెలుసా?

ఇది కూడా చూడండి : గడ్డం బాగా పెరగాలన్నా, అందంగా ఉండాలన్నా ఇలా చెయ్యండి..

English summary

Ex-Pakistan General Musharraf was to the media in the night club while he is dancing with a unknown lady. At present he is staying in Dubai