వెంకటేష్‌ కౌగిలించుకున్నాక భయం పోయిందట

Music Director Gibran on Venkatesh And Maruthi Film

06:52 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Music Director Gibran on Venkatesh And Maruthi Film

విక్టరీ వెంకటేష్‌ తాజాగా నటిస్తున్న చిత్రం 'బాబూ....బంగారం'. 'భలేభలే మగాడివోయ్‌' చిత్రంతో స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగిన మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార క్రియేషన్స్‌తో, డి.సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నాడు. రన్‌ రాజా రన్‌, జిల్‌, ఉత్తమ విలన్‌, చీకటి రాజ్యం వంటి చిత్రాలకు సంగీతం జిబ్రాన్‌ చిన్నప్పటి నుండి వెంకటేష్‌ సినిమాలు చూస్తూనే పెరిగాడట. అలాంటిది అటువంటి స్టార్‌ హీరో సినిమాకి సంగీతం అందించాలంటే మొదటి చాలా భయం వేసింది. కానీ ఒక పార్టీలో వెంకటేష్‌ గారు నన్ను బాగా రిసీవ్‌ చేసుకుని నన్ను కౌగిలించుకోవడంతో నా భయం మొత్తం పోయింది అని జిబ్రాన్‌ తెలియజేసాడు. ఇప్పటికీ ఈ చిత్రానికి సంబందించి మ్యూజిక్‌ కంపోజింగ్‌ కూడా పూర్తయిపోయిందని తెలియజేశాడు.

English summary

Young Music Director Gibran who gave superb music to Super Hit Films like Run Raja Run,Uttama Villan says that he was very happy to compose music to venkatesh to his next movie with Director Maruthi.