జక్కన్న కు నో చెప్పిన మ్యూజిక్‌ డైరెక్టర్‌

Music Director rejected Rajamouli's offer

05:44 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Music Director rejected Rajamouli's offer

తన అద్భుతమైన చిత్రాలతో దేశాన్ని తన వైపుకు తిప్పుకున్న దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి. మనందరికీ తెలిసిందే రాజమౌళి తన ప్రతీ చిత్రానికి యమ్‌.యమ్‌. కీరవాణినే సంగీతం అందిస్తాడు. రాజమౌళి మొదటి చిత్రం స్టూడెంట్‌ నెం.1 నుండి ఇప్పటి బాహుబలి వరకు కీరవాణియే సంగీతం అందించాడు. అయితే రాజమౌళి మొదట కళ్యాణ్‌ కోడూరి కి స్టూడెంట్‌ నెం.1 చిత్రానికి సంగీతం అందించే అవకాశాన్ని ఇచ్చాడట. కానీ అంత ప్రోజెక్ట్‌కి తాను సరిపోనని ఈ చిత్రానికి చెయ్యనని చెప్పాడట. ఒకవేళ కళ్యాణ్‌ ఈ చిత్రానికి చేసి ఉంటే నేను పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయ్యి ఉండే వాడినని కళ్యాణే చెప్పుకున్నాడు.

ఈ విషయాన్ని కళ్యాణ్‌ స్వయంగా తెలియజేశాడు. కళ్యాణ్‌ కోడూరి ఎవరో కాదు కీరవాణి కి స్వయంగా తమ్ముడు. కళ్యాణ్‌ ఐతే, ఆంధ్రుడు, బాస్‌, అష్టాచమ్మా, అలా మొదలైంది, గోల్కొండ హైస్కూల్‌ వంటి చిత్రాలకు సంగీతం అందించాడు.

English summary

Music Director Kalyan Koduri rejected Rajamouli's offer. Rajamouli gave chance for his first movie Student no.1 to compose music. But he rejected the offer.