'ఇళయరాజా' సరికొత్త రికార్డు!!

Music Maestro Ilayaraja creating a record

04:49 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Music Maestro Ilayaraja creating a record

సంగీత దిగ్గజం మ్యాస్ట్రో ఇళయరాజా సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. ఇప్పటి వరకు ఇళయరాజా 999 చిత్రాలకు సంగీతం అందించారు. తాజాగా బాల దర్శకత్వం వహించిన 'తారాయ్‌ తప్పట్టాయ్‌' చ్రితానికి సంగీతం అందించారు. ఇది ఇళయరాజా 1000వ చిత్రం. ఇప్పటి వరకు 1000 చిత్రాలకు స్వరాలు అందించిన సంగీత దర్శకుడిగా ఇళయరాజా రికార్డు సృష్టించనున్నారు. 'తారాయ్‌ తప్పట్టాయ్‌' ఆడియోని డిసెంబర్‌ 17న విడుదల చేయబోతున్నారు, ఇది ఇళయరాజా 1000వ ఆల్బమ్‌ కాబట్టి ఈ ఆడియో వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించాలని చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ వేడుకకి ప్రముఖ సినీ స్టార్లు, సెలబ్రిటీలు హాజరు కానున్నారు. ఇంకో విషయం ఏమిటంటే ఇళయరాజా సంగీతం అందించిన 999 వ చిత్రం 'అబ్బాయితో అమ్మాయి'. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోని ఇటీవలే విడుదల చేయగా ఈ పాటలకు మంచి స్పందన వస్తోంది.

English summary

Music Maestro Ilayaraja creating a record by composing 1000 movie albums in his carrier.