శ్రీవారికి రధం విరాళంగా అందించిన  ముస్లీం 

Muslim Donation To Tirupathi Temple

05:44 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Muslim Donation To Tirupathi Temple

శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల ఏడుకొండల పై కులువై , కలియుగ దైవంగా భక్తుల కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా విరాజిల్లుతున్నాడు. నిత్యం వేలాది మంది శ్రీవారిని దర్శించి కానుకలు సమర్పించడం రివాజే. అయితే మత సామరస్యం చాటుతూ. భిన్నత్వంలో ఏకత్వ భావనను గుర్తుచేస్తూ , చెన్నైకి చెందిన ఓ ముస్లిం భక్తుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి కూరగాయల రథాన్ని వితరణ చేశారు.

అబ్దుల్‌ గనీ అనే భక్తుడు రూ.30లక్షల విలువైన రథాన్ని తయారు చేయించి శ్రీవారి ఆలయం ఎదుటకు తీసుకొచ్చారు. రథానికి పూజలు నిర్వహించి దేవస్థానం రవాణాశాఖకు స్వాధీనం చేశారు. ఈ సందర్భంగా దాత అబ్దుల్‌ గనీని... టిటిడి డిప్యూటీ ఈవో చెన్నంగారి రమణ తదితరులు సత్కరించారు. అబ్దుల్‌ గనీ గతంలో తిరుమల అశ్వనీ ఆసుపత్రికి వైద్య పరికరాలు కూడా వితరణగా అందజేశారు.

బీబీ నాంచారిని వివాహమాడిన శ్రీ శ్రీనివాసుడు మతభేదం లేదని ఆనాడే చాటాడు అని పలువురు గుర్తుచేస్తున్నారు.

English summary