లిప్‌లాక్‌లు, బికినీలతో నిండిపోయిన ముసుగు ట్రైలర్‌

Musugu Theatrical Trailer

11:25 AM ON 1st March, 2016 By Mirchi Vilas

Musugu Theatrical Trailer

శ్రీకర్‌బాబు దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'ముసుగు'. మనోజ్‌ కృష్ణ, హర్ష కృష్ణమూర్తి, త్రినాధ్‌ పంపన, జెస్సీ, పూజశ్రీ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వేద ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్‌ పై దగ్గుబాటి వరుణ్‌ నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత దగ్గుబాటి వరుణ్‌ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఒకేసారి చిత్రీకరించాం, మా సంస్థలో నుండి వస్తున్న తొలి చిత్రమిది. ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం గోవాలోనే చిత్రీకరించాం. రొమాంటిక్‌ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఔట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. శ్రీకర్‌బాబు ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్‌కు వెళ్లింది అని తెలిపారు. దర్శకుడు శ్రీకర్‌బాబు మాట్లాడుతూ త్వరలోనే ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేసి మార్చి చివరిలో సినిమాని విడుదల చేస్తాం. నున్న నమ్మి నా దర్శకత్వంలో సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాతకు నా కృతజ్ఞతలు. ఈ చిత్రం ఎంతో రిచ్‌గా వచ్చేలా నిర్మాత కూడా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం నవనీత్‌చారి మరియు సి.ఎన్‌.ఆదిత్య.

ఈ చిత్రం ట్రైలర్ తో పాటు మరికొన్ని స్లైడ్ షోలు కూడా మీకోసం

1/10 Pages

English summary