భర్త చేతిలో మోసపోయిన హీరోయిన్

My husband cheated me Says Heroine Pujitha

03:19 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

My husband cheated me Says Heroine Pujitha

ఒకప్పుడు తెలుగులో హీరోయిన్ గా రాణించి, ఆ తరువాత బుల్లితెర పై కూడా తన నటనతో మెప్పించిన నటి పూజిత ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది . తన భర్త నుంచి ఆమెకు, ఆమె కొడుకుకు ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకు వచ్చింది . తన భర్త ఒక ఎంపీ దగ్గర పీఏగా పనిచేస్తున్నాడని,తన భర్త పేరు విజయ్ అని చెప్పుకొచ్చింది . తన భర్త ఆమెను మోసగించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన రేఖా రాణిని రెండో వివాహం చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. తనను తన కొడుకుని పట్టించుకోకుండా తన భర్త విజయ్ వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పుకొచ్చింది .ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవట్లేదని పూజిత అంటున్నారు.

ఇవి కూడా చదవండి:దెయ్యాలు తెల్ల చీరే ఎందుకు కట్టుకుంటాయి?

ఇది ఇలా ఉంటే రేఖారాణి వాదనలు మరోలా ఉన్నాయి. విజయ్, పూజితలు విడిపోయి పదేళ్లైందని.. న్యాయపరంగానే తనకు, విజయ్ కు వివాహమైందని చెబుతున్నారు. ఆమె భర్త విజయ్ స్పందిస్తూ అసలు తాను పూజితను పెళ్ళి చేసుకోలేదని, ఆమెతో కేవలం 12 ఏళ్లపాటు సహజీవనం చేశానని , తమకు ఓ కొడుకు ఉన్న మాట నిజమేనని ఒప్పుకున్నాడు. గత 7 సంవత్సరాలుగా తనకు పూజితతో ఎటువంటి మాటలు లేవని , పూజిత తన ఫోన్ నంబర్ కూడా తన దగ్గర లేదని విజయ్ చెబుతున్నాడు. పూజితకు ఏమైనా సమస్యలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసాడు.

ఇవి కూడా చదవండి:బికినీ ఫోజులతో హీటెక్కిస్తున్న రాధిక ఆప్టే

ఇవి కూడా చదవండి:హీరో గోపీచంద్ భార్య రేష్మ గురించి మీకు తెలియని నిజాలు

ఇవి కూడా చదవండి:భార్య డాన్స్ చేసిందని.. ఆమెను భర్త ఏం చేసాడో తెలుసా?

English summary

Veteran Actress Pujitha came to media after a long time by saying that her husband cheated her. She says that Her husband used ton Torcher her and her Son. She also said that her husband also married an IAS Officer named Rekha Rani.