ఎర్త్ క్వేక్ లను కనిపెట్టే మై షేక్ యాప్

My Shake App That Records Earthquakes

11:22 AM ON 17th February, 2016 By Mirchi Vilas

My Shake App That Records Earthquakes

మనదేశంలో తక్కువగానీ.. విదేశాల్లో భూకంపాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా జపాన్, న్యూజిలాండ్, అమెరికా తదితర దేశాల్లో ఇవి ఎక్కుగా సంభవిస్తుంటాయి. అయితే ఇకపై భూకంపాలను ముందుగానే గుర్తించడం ద్వారా సురక్షిత ఉండేందుకు అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడే యూజర్ల కోసం మై షేక్ పేరిట ఈ నూతన యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ 4.1 ఆపైన వెర్షన్ కలిగిన డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధక బృందం 'మై షేక్' యాప్‌ను రూపొందించింది. ఆండ్రాయిడ్ డివైస్‌లో ఉండే యాక్సలరోమీటర్ సెన్సార్, జీపీఎస్ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. భూకంపాల తీవ్రతలను గుర్తించే 'సీస్మోమీటర్స్' పనితీరుకు అనుగుణంగా ఈ యాప్‌ను తీర్చిదిద్దినట్టు సదరు పరిశోధకులు తెలియజేస్తున్నారు. ల్యాబొరేటరీలో తాము అన్ని విధాలుగా ఈ యాప్‌ను పరీక్షించామని, దాదాపు 93 శాతం కచ్చితత్వంతో ఈ అప్లికేషన్ పనిచేస్తుందని వారు చెబుతున్నారు.

English summary

Scientists at University of California, Berkeley developed a free Android app called “My Shake” that allows users to record ground shaking from an earthquake.