మైసూరా పిల్ వేశారు... అయితే ఆయన వెనుక ఉన్నదెవరో తెలుసా?

Mysoora reddy puts pill in court

12:17 PM ON 29th November, 2016 By Mirchi Vilas

Mysoora reddy puts pill in court

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సుప్రీం కోర్టులో పిల్ వేయడం దీనిపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడం తెల్సిందే. అంతేకాదు, మిగిలిన హైకోర్టులలో పిల్ ఎవరు వేసినా స్వీకరించకుండా చూడాలని కూడా కేంద్రం కోరింది. అయితే అలా కుదరదని సుప్రీం పేర్కొంది. ఇప్పుడు తెలుగు రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్ వేసింది ఎవరో కాదు. మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎంవి మైసూరా రెడ్డి కావడంతో హాట్ టాపిక్ అయింది. ఇప్పటివరకు న్యాయస్థానాల్లో పడిన పిల్ లకు ఇది భిన్నంగా వుంది. బ్యాంకులు మా డబ్బులు మాకు ఇవ్వకుండా మూసివేస్తున్నారని, ఇది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమేనని పేర్కొంటూ డాక్టర్ మైసూరారెడ్డి ఫైల్ చేసిన పిల్ పై తెలుగు రాజకీయాల్లో చర్చ మొదలైంది.

1/4 Pages

బ్యాంకులు మూసి వేయడమనేది ఐపీ పెట్టి పారిపోయిన వ్యక్తితో సమానమని, వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంక్ కు వెళ్తే డబ్బు ఇవ్వకపోవడం ప్రజల హక్కుల్ని దెబ్బతీయడమేనని డాక్టర్ మైసూరా అందులో ప్రస్తావించారు. దీనిపై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. పిల్ సారాంశాన్ని అటుంచితే దానివెనుకుండే వ్యక్తులు, శక్తులు ఎవరన్న అంశం మీదనే మీడియాలో రకరకాల వార్తలు మొదలయ్యాయి.

English summary

Mysoora reddy puts pill in court