మైసూర్.. క్లీన్ సిటీ ఆఫ్ ఇండియా 

Mysore As Cleanest City Of India

11:00 AM ON 16th February, 2016 By Mirchi Vilas

Mysore As Cleanest City Of India

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మైసూర్ నిలిచింది. నిబంధనలకు లోబడి పరిశుభ్రతను పాటించి 2014 తర్వాత మరోసారి మైసూర్ బెస్ట్ క్లీన్ సిటీగా మారిందని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) వెల్లడించింది. క్యూసీఐ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో విశాఖపట్నం, సూరత్, రాజ్‌కోట్, గ్యాంగ్‌టక్, పింప్రి-చింద్వాడ్ (మహారాష్ట్ర) పట్టణాలు టాప్-10 క్లీన్ సిటీల్లో ఉన్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు, మౌలిక సదుపాయాల కల్పనలో నగరాల మధ్య పోటీతత్వం పెంచేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ లిస్ట్ లో విశాఖ నగరం రెండు అవార్డులను సొంతం చేసుకుంది. తొలి విడత స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 73 నగరాలు, పట్టణాలు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ జాబితాలో హైదరాబాద్‌ 19, విజయవాడ 23, వరంగల్‌ 32 ర్యాంకులు సాధించాయి. పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని నగరాలకు ర్యాంకింగ్‌ ఇచ్చారు. 2019 నాటికి స్వచ్ఛ భారత్‌ సాధించాలన్నది ప్రధాని ఆశయం.

English summary