మైసూర్ రాజా ఇంట పెళ్లి చూడతరమా!

Mysore Maharaja Wedding Celebrations

11:17 AM ON 28th June, 2016 By Mirchi Vilas

Mysore Maharaja Wedding Celebrations

దేశంలో మరీ ముఖ్యంగా సౌతిండియాలో క్రేజ్ గల సుప్రసిద్ధ మైసూరు ప్యాలెస్ దేదీప్యంగా వెలిగిపోతోంది. ఈ చారిత్రక అపురూప కట్టడం ఇప్పుడు పెళ్లిశోభతో కళకళ లాడుతోంది. దాదాపు 40ఏళ్ల తర్వాత ఇక్కడ పెళ్లిబాజా మోగింది. యువరాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్ వివాహం సోమవారం ఉదయం అంగరంగవైభవంగా జరిగింది.

అంబా విలాస్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో కర్కాటక లగ్నంలో యదువీర్, త్రిషికాకుమార్ సింగ్ వివాహబంధంతో ఒకటయ్యారు. యదువీర్ ఒడెయర్ వంశానికి చెందిన 27వ రాజు. అమెరికాలోని బోస్టన్ యూనివర్శిటీలో ఎకనామిక్స్, ఇంగ్లీష్ లో బీఏ పూర్తి చేశారు.

త్రిషికాకుమార్ రాజస్థాన్ లోని దుంగన్ పూర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన హర్షవర్ధన్ సింగ్, మహేశ్వరి కుమారి దంపతుల పుత్రిక.

హేమాహేమీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. కర్ణాటక సిఎం సిద్ధరామయ్య, మంత్రివర్గ సహచరులు, వివిధ దేశాల రాయబారులు, ఒకప్పటి రాజకుటుంబాలకు చెందిన వాళ్లు..ఇలా దాదాపు వెయ్యిమంది వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇక జూన్ 28న అలాగే జూలై 2న మైసూరు ప్యాలెస్, బెంగళురులో న్యూకపుల్ వెడ్డింగ్ రెసెప్షన్ ఇవ్వనున్నారు.

1/7 Pages

English summary

Mysore Maharaja wedding cermony was done grandly in Mysore palace in Mysore. So many people from all over the world were attended to this wedding and blessed the new couple.