చెత్తతో నిండిపోయిన మైసూరు ప్యాలస్!

Mysore palace filled with wastage

04:23 PM ON 14th October, 2016 By Mirchi Vilas

Mysore palace filled with wastage

మైసూరు మహారాజు యదువీర్ ఒడియరును ప్రజలు నొప్పించారు. దసరా పర్వదినం సందర్భంగా వూరేగింపులు, విందు వినోదాలతో మైసూరు ప్యాలస్ లో అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. వేడుకల అనంతరం ప్యాలస్ మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయింది. ప్యాలస్ లోని దర్బార్ హాలులో ప్రజలు తినిపారేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లేట్లు, పేపర్ బ్యాగులు చెల్లాచెదురుగా పడివున్న ఫొటోను యదువీర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇలా ఎక్కడపడితే అక్కడ చెత్త పారేస్తే మన మైసూరు శుభ్రమైన నగరం అన్న బిరుదును కోల్పోతుంది. ప్యాలస్ సినిమా థియేటర్ కాదు అన్న విషయం ప్రజలు ఎప్పుడు అర్ధం చేసుకుంటారు(అలాగని థియేటర్ లో చెత్త పడేయొచ్చని నా ఉద్ధేశం కాదు).

ఇప్పటివరకు దర్బారు ప్రాంగణంలో తినడానికి ఎప్పుడూ అనుమతించలేదు. ఉత్సవాల సమయంలో మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నది మనం గుర్తుంచుకోవాలి అంటూ పోస్ట్ చేశారు. గత రెండేళ్లుగా భారత్ లోనే అత్యంత శుభ్రమైన నగరంగా మైసూరు పేరుపొందింది. ఈ నేపథ్యంలో యదువీర్ ఒడియరు ఆగ్రహం వ్యక్తంచేశారు. అందులోనూ మైసూరు ప్యాలస్ నుంచి బన్నిమంటప వరకు ఏనుగులపై ఐదు కిలో మీటర్ల వరకు వూరేగించడంతో ప్యాలస్ ప్రాంగణం మొత్తం చెత్తతో పేరుకుపోయింది. యదువీర్ పోస్ట్ కి... నిజమే.. ఇలా చేయడం నిజంగా సిగ్గుచేటు అంటూ ఎందరో కామెంట్ చేశారు.

English summary

Mysore palace filled with wastage