బంగారంతో శుభలేఖలు..ఎవరి పెళ్ళికో తెలుసా?

Mysore Prince marriage with lavish ceremony

11:37 AM ON 21st June, 2016 By Mirchi Vilas

Mysore Prince marriage with lavish ceremony

మనదేశంలో ఎన్నో రాజ కుటుంబాలున్నాయి. కొందరు చితికిపోయినా, కొన్ని కుటుంబాలు తెరమరుగైనా, కొన్ని కుటుంబాల్లో ఇంకా రాజసం ఉట్టిపడుతోంది. అలాంటి రాజసం గల రాజ కుటుంబాల్లో వేడుకలు ఏమైనా జరిగితే, అందుకు తగ్గట్టే ఉంటున్నాయి. తాజాగా మైసూర్ యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ్ ఒడయార్ వివాహానికి శుభఘడియలు దగ్గరపడ్డాయి. రాజస్థాన్ దుంగార్పూర్ కి చెందిన త్రిషిక కుమారి సింగ్ తో జూన్ 27న వివాహాన్ని హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా జరిపేందుకు పెద్దలు అన్ని ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నారు.

వడయార్ వంశంలో 27వ వాడైన ఈ యువరాజు వివాహం అంబా విలాస్ ప్యాలెస్ లో జరుగనుంది. ఇక ఈ యువరాజు పెళ్లి పత్రికలను పంచే కార్యక్రమం ఇటీవలే ప్రారంభమైంది. ఈ ఆహ్వాన పత్రికలు తయారైన విధానాన్ని చూస్తే కుభేరుడికి సైతం దిమ్మతిరిగిపోవాల్సిందే. బంగారు తాపడంతో వివాహ పత్రికను తయారు చేశారు. మైసూరు రాజవంశీకుల సంప్రదాయం ప్రకారం గండభేరుండం, ప్యాలెస్ చిహ్నాలతో కూడిన ఆహ్వాన పత్రికలను సిద్ధం చేశారు. మొత్తం ఐదు రకాల ఆహ్వాన పత్రికలు సిద్ధం కాగా అతిథుల హోదాను అనుసరించి వాటిని పంచిపెడుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి బంగారు లేపనం చేసిన పత్రికను త్రిషికా తండ్రి హర్షవర్థన్ అందించి, పెళ్లికి రావాలని ఆహ్వానించారు.

పలువురు కేంద్ర మంత్రులకు, కర్ణాటక, రాజస్థాన్ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, మాజీ ప్రధాని దేవేంద్రగౌడకు, వసుంధరా రాజేలకు, రాజకీయ ప్రముఖులకు, సినీ ప్రముఖులకు, క్రీడారంగ ప్రముఖులకు పంచినట్టు రాజ కుటుంబీకుల సన్నిహితుల టాక్.

English summary

Mysore Prince marriage with lavish ceremony