మన ఇండియా లో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో.. అవేంటో మీరే చూడండి

Mysteries Of India

05:17 PM ON 9th February, 2016 By Mirchi Vilas

Mysteries Of India

ఒకప్పుడు మానవుడు అద్భుత శక్తులు , వింత , దేవుడి సృష్టి అని భావించిన వాటంన్నిటి వెనుక దాగి ఉన్న రహస్యాలను చేధించాడు మానవుడు. అద్భుతమైన శక్తులంటూ ఏమీ లేవని నిరూపించిన మానవుడికి ఇప్పటికీ సమధానాలు దొరకని మిస్టరీలెన్నొ ఉన్నాయి .

మన దేశంలో ఇప్పటికీ పరిష్కరించలేని కొన్ని  మిస్టరీలను ఇప్పుడు చూద్దాం.

1/10 Pages

కవలల ఊరు


కవలల ఊరు ఏంటి అనుకుంటున్నారా..? ఆ ఊరిలో ఎక్కువ మంది కవల పిల్లల పుట్టడం కారణంగా కేరళ రాష్ట్రంలోని మలప్పరం జిల్లాలో ఉన్న "కొడివి" అనే ఊరికి కవలల ఊరుగా పేరు వచ్చింది . మొత్తం 2 వేల కుటుంబాలు ఉండే ఆ చిన్న ఊరులో 400 కవలలు ఉన్నారు . ఒక నివేదిక ప్రకారం సాధారణంగా ప్రతి వెయ్యి మందిలో ఆరుగురు కవలలు జన్మిస్తారు , కానీ ఈ గ్రామంలో మాత్రం ప్రతి 1000 మందిలో 45 మంది  కవలలు జన్మిస్తున్నారు . ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడి మహిళలకు పెళ్లిళ్లై దూర  ప్రాంతాలకు వెళ్లినా సరే వారికి కూడా కవలలు జన్మిస్తుండడం విశేషం .ఈ ఊరిలొ పది సంవత్సరాల వయసు గల పిల్లల్లో 80 మంది జతల కవలలు ఉన్నారు . ఇలా అత్యధిక సంఖ్యలో కవలలు జన్మిస్తున్నారు అన్న విషయం పై ఎందరో శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరిపినా ఈ ఊరిలో మాత్రమే ఇలా ఎక్కువ మంది కవలు ఎందుకు పుడుతున్నారన్నది మాత్రం అంతుచిక్కని మిస్టరీ గానే మిగిలిపోయింది.

English summary

Here are some of the mysteries that till today remain unsolved and unexplained. Let’s take a look at some of these mysteries of India that have baffled people throughout the ages.