రాత్రిళ్ళు అక్కడికి వెళ్తే, తిరిగిరావడం కష్టమట ... అయితే అక్కడేం వున్నాయి (వీడియో)

Mysterious Dumas Beach In Gujarat

12:13 PM ON 28th December, 2016 By Mirchi Vilas

Mysterious Dumas Beach In Gujarat

ప్రపంచంలో అనేక వింతలూ, మిస్టరీలు జరుగుతూ ఉంటాయి. కొన్ని వార్తల్లోకి ఎక్కితే, మరికొన్ని మరుగున పడిపోతుంటాయి. ఇక మన దేశంలో ఎన్నో మిస్టరీ ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటివాటిలో గుజరాత్ రాష్ట్రం సూరత్ లో ఉన్న డుమాస్ బీచ్ ఒకటి . ఆ బీచ్ కు రాత్రిళ్ళు వెళితే తిరిగి రావడం కష్టమేనట. బీచ్ లో నడుస్తుంటే మన వెనుక ఎవరో గుసగుసలాడుతున్న శబ్దాలు వినిపిస్తాయట ! తీరా చూస్తే ఎవరూ కనిపించరని అంటారు. ఆ బీచ్ కెళ్ళినవాళ్ళలో కొంతమంది అదృశ్యమైన ఘటనలు కూడా జరిగాయని చెబుతారు. ఇది ఏ ఒక్కరి అనుభవమో కాదు. చాలామంది చెప్పిన విషయాలే.

ఒకప్పుడు ఆ బీచ్ శ్మశానం అనీ, చనిపోయినవారి ఆత్మలు అక్కడ ఇంకా తిరుగుతూనే ఉన్నాయని ఒక నమ్మకం బలంగా ఉండేదట. ఇక ఈ బీచ్ లో పలు భయానక సంఘటనలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతుంటారు. ఈ బీచ్ లో ఇసుక కూడా వింతగా నలుపు రంగులో ఉంటుంది. ఆ ఇసుకని చూస్తే చాలామంది భయపడతారట. మార్నింగ్ వాకర్స్ కి, పర్యాటకులకు ఆ ప్రశాంత వాతావరణంలో కూడా గట్టిగా అరుపులు, వింత ఏడుపులు, మూలుగులు వినిపించేవట. దాంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యేవారట.

ఇంతకీ అందమైన బీచ్ లో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో వెళ్ళిన చాలామంది జాడలేకుండా పోయారని కూడా అంటారు. ఇవన్నీ గమనించి రాత్రిపూట ఈ బీచ్ లో ఎవ్వరినీ ఉండనివ్వరట. అయితే ఇదంతా వట్టి అబద్ధం అని కొట్టిపారేసే వారు లేకపోలేదు .ఇక్కడికి పగలు మాత్రం జనం బానే వస్తారు, కానీ చీకటిపడితే మాత్రం ఆ బీచ్ లో ఒక్కరు కూడా కనబడరు. రాత్రిళ్ళు బీచ్ దగ్గర ఎంజాయ్ చేద్దామనుకుని వెళ్ళినాగానీ అక్కడ ఎవ్వరినీ ఉండనివ్వరట. అందుకే ఈ ప్రాంతానికి ఒక మిస్టరీ ప్రదేశంగా గుర్తింపు వచ్చింది.

ఇవి కూడా చదవండి: కొత్త బట్టలైనా సరే ఒకసారి ఉతికాకే వేసుకోకపోతే ఏమవుతుందో తెలుసా..?

ఇవి కూడా చదవండి: గుండెపోటుని అడ్డుకునే ఆయుధం ఇదే!

English summary

There were so many mysterious places and haunted placed in the world and there is an beach named Dumas Beach in Gujarat State in India and in this beach so many were believe that there were soul in this beach area.