ఐదు ప్రదేశాల మిస్టరీ వెనుక లాజిక్

Mystery behind five places

06:40 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Mystery behind five places

ప్రపంచంలో చాలా విషయాలు వాటి వెనుకనున్న రహస్యాలు అంతుచిక్కవు. అలాంటి మిస్టరీగా మిగిలిన ప్రదేశాలే బెర్ముడా ట్రయాంగిల్‌, ది బ్లప్‌, ఐరన్‌ పిల్లర్‌ ఢిల్లీ,  హోమర్స్‌ ఒడెస్సీ, రహస్యాల చోటు ఈ ఐదు ప్రదేశాలు మిస్టరీగా మిగిలాయి. అసలు వీటి వెనుకనున్న లాజిక్‌ ఏమిటి ? అసలు కథ ఏమిటి అనే విషయాలు ఎవరికీ తెలియదు. ఎక్కడ శాస్త్రం ఆగుతుందో అక్కడ తత్వం మొదలవుతుంది, ఎప్పుడైతే తత్వం ముగుస్తుందో అక్కడ శాస్తం మొదలవుతుందని ఆంగ్ల నానుడి ఉంది. అలాంటి ప్రదేశాలే ఈ ఐదు కూడా...ఈ ప్రదేశాల హిస్టరీలు ఇప్పటికీ మిస్టరీలుగానే మిగిలాయి. దీని వెనుకున్న లాజిక్‌ను సైన్సు చేధించలేకపోయింది. అలాంటి మ్యాజికల్‌ వండర్స్‌ అయిన ఈ ఐదు ప్రదేశాల గురించి వాటి వెనుక లాజిక్స్‌ గురించి తెలుసుకుందాం.

1/6 Pages

1. బెర్ముడా ట్రయాంగిల్‌

వాయువ్య అట్లాటింక్‌ మహాసముద్రప్రాంతంలో గల ఈ బెర్ముడా ట్రయాంగిల్‌ ప్రదేశం ఒక మిస్టరీ. దీన్ని 'డెవిల్స్‌ ట్రయాంగిల్‌' అని పిలుస్తారు. గాలిలో ప్రయాణించే విమానాలు, ఆ ప్రదేశంలో ప్రయాణించే నౌకలు అదృశ్యమైపోతున్నాయి. ఇలా చాలా కాలం నుండి సాగుతుంది. అందుకనే  ఈ ప్రదేశాన్ని ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించారు. ఈ ప్రదేశం వెనుక ఎన్నో కధలు ఉన్నాయని చెపుతున్నా, దాని వెనుక ఉన్న రహస్యాన్ని మాత్రం చేధించలేకపోయారు. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండడం వలన ఇలా సంభవిస్తున్నాయని కొందరు చెబుతున్నారు.

English summary

Everyone has heard of the Bermuda Triangle and the mysteries that surround it.  It’s not the only place you can find creepy things happening here are some other places on Earth.