కళాభవన్‌ మణి మరణం వెనుక మిస్టరీ

Mystery behind Kalabhavan Mani death

01:15 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Mystery behind Kalabhavan Mani death

మలయాళంకు చెందిన ప్రముఖ నటుడు కళాభవన్‌ మణి ఇటీవల మరణించడం, పలువురు సంతాపం తెలపడం తెల్సిందే. అయితే మణి మరణం వెనుక మిస్టరీ ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి. వివరాల్ళోకి వెళితే మణి ఆరోగ్యం క్షీణించడంతో వైద్యం చేయించేందుకు కేరళలోని ఒక హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే అప్పటికే ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు కాపాడటంలో విఫలం అయ్యారు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఈయనది సహజ మరణం కాదు అంటూ ఇప్పుడు డాక్టర్లు అంటున్నారు. కళాభవన్‌ మణి బాడీని పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు ఈయనది సహజ మరణం కాదు అని, ఈయన మరణంకు ముందు విషపదార్థాలు తీసుకునైనా వుండాలని, లేకుంటే ఎవరైనా విషపదార్థాలు ఇచ్చి ఉంటారనేది వైద్యుల అనుమానమట.

ఈ విషయాన్నే వారు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ప్రస్తుతం పోలీసులు ఈ విషయమై విచారణ జరుపుతున్నట్లు వార్తలు పొక్కాయి. మరణంకు ముందు మణి ఎవరిని కలిశాడు, ఎవరితో గడిపాడు అనే విషయాల పై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పోలీసులు తమ విచారణ నివేదికను తెలియజేయనున్నారు. కళాభవన్‌ మణి మరణం అసహజం అని తెలిసిన సినీ ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మరణ మిస్టరీ తేలాల్సి వుంది, అంతదాకా ఎన్ని ఊహాగానాలో వస్తూ వుంటాయి.

English summary

Recently tamil veteran actor Kalabhavan Mani was died due to some health problems. Now there is a Mystery behind Kalabhavan Mani death.