ఆ సూట్‌కేసులో ఏముంది??

Mystery behind Ntr suitcase

11:21 AM ON 5th January, 2016 By Mirchi Vilas

Mystery behind Ntr suitcase

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన 25వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'. క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బివిఎస్‌ఎన్ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలవబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన సంక్రాంతి రిలీజ్‌ అనే పోస్టర్స్‌ని విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ ని ఎప్పుడూ చూడని విధంగా అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఒక సూట్‌కేస్‌ని పట్టుకుని వస్తున్న స్టిల్‌తో అదరగొడుతున్నాడు. అయితే ఇందులో ఎన్టీఆర్‌ పట్టుకున్న సూట్‌కేస్‌ చాలా వింతగా ఉంది. మనం ఎప్పుడూ చూడని విధంగా ఆ సూట్‌కేస్ చాలా పొడవుగా కాలి కింద వరకు ఉంది.

ఈ స్టిల్‌ చూసి అందరూ ఆ సూట్‌కేస్‌ లో ఏముంది? అని ప్రశ్నించుకుంటున్నారు. ఆ సూట్‌కేస్ లో ఏముంది? డబ్బా, బంగారమా, బోంబా, డాక్యుమెంట్సా, సక్సెస్‌ ఆ ఇలా ఎన్నో ఊహించుకుంటున్నారు. అసలు ఆ సూట్‌కేస్‌లో ఏముందో తెలియాలంటే జనవరి 13 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన మొదటిసారి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కధానాయికగా నటించింది. ఇంకా జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు. దేవీశ్రీప్రసద్‌ సంగీతాన్ని అందించారు.

English summary

Mystery behind Ntr suitcase in Nannaku Prematho.