నిర్మాతలకు షాక్ ఇస్తున్న పవన్ అత్త!

Nadhiya demanding 1 crore for movie

11:14 AM ON 16th June, 2016 By Mirchi Vilas

Nadhiya demanding 1 crore for movie

ఏదైనా కాలం కలిసి వస్తే అంతేమరి. ఇప్పుడు నదియా తీరు అలా మారిపోయింది. హీరోయిన్గా చేసినప్పటి కంటే... ఇప్పటి తల్లిపాత్రలతో, అత్త పాత్రలతో ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్న నదియా చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్గా మారాయి. ఆమె ఉంటే సినిమా హిట్ అవుతుందనే టాక్ కూడా వచ్చింది. మిర్చి సినిమాతో ఆమె తల్లిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తరువాత చేసిన అత్తారింటికి దారేది తో మంచి క్రేజ్ ని మూటగట్టుకుంది. అ..ఆ... సినిమా వరకు నదియా హవా నడుస్తూనే ఉంది. ఆమె ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఖరీదైన అత్త, అమ్మగా మారింది. క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని... తన దగ్గరకి వచ్చే దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది.

ఆమె అడిగే రెమ్యునరేషన్ దాదాపు టాప్ హీరోయిన్ పారితోషికానికి దగ్గరగా ఉంటోందట. అంటే కోటి వరకు ఆమె అడుగుతోందన్న మాట. దీంతో నిర్మాతలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అ..ఆ.. సినిమా సూపర్ సక్సెస్ తరువాత ఆమె మాట్లాడేతీరు కూడా మారిపోయిందట. ఎంతైనా అదృష్టం కలిసొస్తే ఇలాగే ఉంటుందేమో. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో నదియా ఓ వెలుగు వెలిగిపోతోంది. అందుకే డిమాండ్ కి తగ్గట్టు రెమ్యూనరేషన్ కూడా లాగేస్తోంది.

English summary

Nadhiya demanding 1 crore for movie